BIG BREAKING: గ్రూప్-1 పరీక్షలపై బిగ్ ట్విస్ట్! TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని వేసిన పిటిషన్‌ను సింగల్ బెంచ్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు అభ్యర్థులు. కాగా అప్పీల్ పిటిషన్ ను హైకోర్టు పాస్ ఓవర్ చేసింది. By V.J Reddy 18 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి TGPSC GROUP-1: తెలంగాణలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షపై మరోసారి గందరగోళం నెలకొంది. ఇప్పటికే మెయిన్స్ పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఆ పిటిషన్ ను హైకోర్టు పాస్ ఓవర్ చేసింది. కాగా ఈ మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే జీవో 29 కూడా రద్దు చేయాలని అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: కేటీఆర్ పరువు నష్టం కేసు వాయిదా ఈ నెల 21 నుంచి... ఇటీవల గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు అడ్డకుంలు తొలిగిస్తూ తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే అధికారులు మెయిన్స్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా నిన్న TGPSC అధికారులతో సీఎస్ శాంతి కుమారి సమావేశం నిర్వహించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు, సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. కాగా ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ జరగనుంది. ఈ మెయిన్స్ పరీక్షకు మొత్తం 6 పేపర్లు ఉండనున్నాయి. ప్రతీ పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనుంది టీజీపీఎస్సీ. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. కేవలం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రమే ఈ పరీక్ష ను నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు! హాల్ టికెట్స్ విడుదల.... ఇటీవల TGPSC గ్రూప్-1 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు https://hallticket.tspsc.gov.in/h022024d08f5d90-6aaa-4360-acb2-046f588e3284 లింక్ పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గ్రూప్-1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ (TGPSC Group-1) విడుదల చేసింది. మొత్తం 563 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. జూన్ 9న ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మంది హాజరు కాగా.. 31,382 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు! ఇది కూడా చదవండి: తమిళ మాజీ సీఎంకు పవన్ నివాళి.. వైరల్ అవుతున్న ట్వీట్! #telangana-news #telangana-high-court #tgpsc-group-1 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి