Grama Sabha : రాష్ట్రంలో కొనసాగుతొన్న గ్రామ సభలు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తోన్న గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతొన్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకోసం గ్రామ సభల్లో ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

New Update
telangana

telangana

Grama Sabha : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు అర్హులైన అబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో నిర్వహిస్తోన్న గ్రామ సభలు కొనసాగుతున్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర నాలుగు పథకాలకు ధరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారులను ఈ సభల్లో ఎంపిక చేయనున్నారు. స్వీకరించిన ధరఖాస్తులను పరిశీలించి గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న గ్రామసభల్లో ప్రభుత్వం సంకల్పం, పథకాలను ప్రజలకు వివరించి వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.   

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్ గ్రేటర్ లో మాత్రం ఎక్కడ సభలు నిర్వహించిన దాఖాలాలు కనిపించడం లేదు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికకోసం నిర్వహించాల్సిన వార్డు సభలు ఇప్పటివరకు మొదలు కాలేదు.  అయితే ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర పథకాల ఎంపిక కోసం చేపట్టిన ఆర్థిక సర్వే గ్రేటర్ లో ఇంకా పూర్తి కాలేదు. దీంతో వార్డు సభల నిర్వహణ ఇంకా మొదలు పెట్టనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు సర్వే కొనసాగనున్న దృష్ట్యా ఫిబ్రవరి మొదటివారం నుంచి వార్డు సభలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.  

అయితే సర్వేలోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు లేని వారిని ఎంపిక చేస్తుండడంతో వార్డు సభల్లో లబ్ధిదారుల ఎంపిక సులభమయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు జరుగుతున్నప్పటికీ గ్రేటర్ లో మాత్రం ఇంకా ప్రారంభించలేదని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori :  జైలులో అఘోరీ రచ్చరచ్చ...వర్షిణీ లేకుండా ఉండలేనంటూ

అఘోరీ, వర్షిణీ కేసు రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే, అఘోరీని జైలుకు తీసుకువచ్చినప్పుడు అరుపులు, కేకలతో హంగామా చేశాడు. వర్షిణిని నా దగ్గరే ఉంచాలి..అంటూ గట్టిగా అరుస్తూ జైలులో వీరంగం సృష్టించడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

New Update
Aghori in prison

Aghori in prison

Aghori : అఘోరీ, వర్షిణీ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా ఒక మహిళా నిర్మాతను మోసం చేసిన విషయంలో అఘోరీ శ్రీనివాస్ ను మోకిలా పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్‌ను అరెస్టు చేసి కంది సబ్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే, కంది సబ్ జైలుకు తీసుకువచ్చినప్పుడు అఘోరి శ్రీనివాస్ అరుపులు, కేకలతో హంగామా చేశాడు. వర్షిణిని నా దగ్గరే ఉంచాలి.. అంటూ గట్టిగా అరుస్తూ జైలులో వీరంగం సృష్టించాడు. అఘోరి ప్రవర్తనను చూసి జైలు సిబ్బంది సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక రిమాండ్ నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్‌ను ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయనను ట్రాన్స్ జెండర్ గా గుర్తించారు. దాంతో కంది సబ్ జైలు అధికారులు జైలులోకి ప్రవేశానికి నిరాకరించారు. దానితో, పోలీసులు శ్రీనివాస్‌ను మరోసారి వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  అనంతరం చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచగా, న్యాయమూర్తి 14రోజుల రిమాండ్‌ విధించడంతో సంగారెడ్డి జిల్లా కంది సబ్‌జైలుకు తరలించారు. అంతకు ముందు అఘోరీని ఏ బ్యారక్‌లో ఉంచాలో తేల్చుకోలేక కంది జైలు అధికారులు తలలు పట్టుకున్నారు. చేసేది లేక తిరిగి పోలీసులకు అప్పగించారు.

ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!
 
మహిళా ఖైదీలు ఉండే బ్యారెక్‌లో ఉంచాలా.. లేక పురుష ఖైదీలు ఉండే బ్యారక్‌లో ఉంచాలా అనే విషయంపై తేల్చుకోలేక తిరిగి పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి లింగనిర్ధారణ పరీక్షలు చేయించారు. వైద్యుల పరీక్షల్లో అఘోరీ ట్రాన్స్‌జెండర్‌ అని తేలడంతో కోర్టు సూచన మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అఘోరీ భార్య శ్రీవర్షిణీ తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించడంతో ఆమెను హైదర్‌షాకోట్‌లో గల కస్తూర్బా గాంధీ హోంకు తరలించారు. అయితే తన భార్య శ్రీవర్శిని తనతోపాటే జైలులో ఉండాలని, వర్షిణీ లేకుంగా తను ఉండలేనంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. తమ ఇద్దరిని కలిపి ఒకే బ్యారక్‌లో ఉంచాలని  అఘోరీ రచ్చరచ్చ చేయడం తో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.అయితే ఆ తర్వాత తనతో పాటు తన భార్య విచారణలో పోలీసులకు సహకరిస్తామని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

Advertisment
Advertisment
Advertisment