School Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు స్కూల్స్ కు సెలవులు

స్కూళ్లకు సెలవులు అంటే పిల్లలెవరైనా ఎగిరి గంతేస్తారు. మరి ఇది వారి కోసమే. ఈ నెల చివరిలో వరుసగా రెండురోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 26న మహా శివరాత్రి సందర్భంగా అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇక 27న ఎమ్మెల్సీ ఎన్నికలున్న జిల్లాల్లో సెలవును ప్రకటించింది.

New Update
School Holidays

School Holidays

School Holidays : స్కూళ్లకు సెలవులు అంటే పిల్లలెవరైనా ఎగిరి గంతేస్తారు. మరి ఇది వారి కోసమే. ఈ నెల చివరిలో వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఒక సెలవు అందరికీ ఉంటే, మరో సెలవు మాత్రం కొన్ని జిల్లాల పిల్లలకే వర్తిస్తుంది. ఆ జిల్లాలు ఏంటో తెలుసా?

Also Read:  మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!

Also Read :  భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

స్కూలుకు సెలవులంటే విద్యార్థులకు ఎక్కడలేని సంతోషం ఉంటుంది. ఒక్కరోజన్న స్నేహితులతో ఆడుకోవడానికి అవకాశం దొరికిందని ఆనందపడుతారు. అయితే ఈ నెలలో గుడ్‌న్యూస్‌ ఏంటంటే వరుసగా రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే అది అందరికీ కాదు. కొన్ని జిల్లాల వారికి మాత్రమే. ఈ నెల 26న మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. ఇక మరునాడు అంటే 27న కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలున్న జిల్లాల్లో అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవును ప్రకటించింది.

Also Read: Lavanya: ఓవైపు రాజ్ ని ప్రేమిస్తూనే మస్తాన్ సాయితో బెడ్ రూమ్ లో.. లావణ్య గురించి ఫ్రెండ్ ప్రీతీ..

Also Read :  నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!

ఫిబ్రవరి 27న తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అవి కేవలం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ లలో మాత్రమే దీంతో ఈ ఏడు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ఫిబ్రవరి 27న కూడా  ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఈ జిల్లాల విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవులు ఉండనున్నాయి. మిగిలిన జిల్లాల్లో మాత్రం శివరాత్రి రోజు ఒకరోజు మాత్రమే సెలవు ఉండనుంది.

Also Read:  ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!

Also Read:  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు