Special kit : పాఠశాల విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌....21 వస్తువులతో స్పెషల్‌ కిట్‌

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు స్పెషల్‌ కిట్‌ను అదించాలని నిర్ణయించింది. 21 రకాల వస్తువులతో కూడిన స్కూల్ కిట్‌ను ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేయనుంది

New Update
ap stu

Good news for school students.

Special kit : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు స్పెషల్‌ కిట్‌ను అదించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌ మాత్రమే ఇస్తూ వస్తున్న సర్కార్‌ ఈసారి నుంచి ఏకంగా 21 రకాల వస్తువులతో కూడిన స్పెషల్ స్కూల్ కిట్‌ను విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 
 
అంతేకాదు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న  విద్యార్థుల కోసం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. అంతే కాకుండా, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాబోయే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది.

అందరికీ ఒకే రంగు యూనిఫామ్..

ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరిలో సమానత్వ భావం పెంపొందించే విధంగా ప్రభుత్వం ‘ఒకే రాష్ట్రం - ఒకే యూనిఫామ్’ విధానాన్ని అమలు చేయనుంది. గతంలో పాఠశాలల రకాలను బట్టి వేర్వేరు రంగుల యూనిఫాంలు  ఉండగా, ఇకపై అన్ని స్కూళ్లలో ఒకే రంగు, ఒకే డిజైన్ తో కూడిన యూనిఫామ్ అమలు చేయాలని నిర్ణయించారు. ఇది విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంతో పాటు  ప్రభుత్వ పాఠశాలలకు ఓ బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకువస్తుందని విద్యాశాఖ విశ్వసిస్తోంది.

 21 వస్తువులతో స్పెషల్ కిట్

ఇదిలా ఉండగా విద్యార్థులకు మరో కానుక అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. చదువుకు కావాల్సిన సామాగ్రి కోసం పిల్లలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం 21 వస్తువులతో కూడిన భారీ స్కూల్ కిట్‌ను అందించడానికి సిద్ధపడింది. ఆ కిట్‌లో మూడు జతల యూనిఫామ్ క్లాత్, షూస్, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్, షార్ప్‌నర్, జామెట్రీ బాక్స్, డిక్షనరీ వంటి నిత్యవసర వస్తువులు ఉంటాయి. కాగా ఇవ్వన్నీ కూడా పాఠశాలలు పున:ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులందరికీ అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రభుత్వ నిర్ణయం వల్ల 26 లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

Advertisment
తాజా కథనాలు