Ration Card Holders : రేషన్ కార్డు దారులకు శుభవార్త ...ఇక కోడిగుండ్లు కూడా..

రేషన్‌కార్డుదారులకు త్వరలోనే ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పనుంది.కోడిగుండ్లలో ఉండే పోషక విలువలను దృష్టిలో పెట్టుకొని రేషన్‌ షాపుల్లో గుడ్లు పంపిణీ చేయాలని నేషనల్‌ ఎగ్‌ చికెన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బాలస్వామి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

New Update
ration-cards telangana

ration-cards telangana

Ration Card Holders : రేషన్‌కార్డుదారులకు త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పనుంది.కోడిగుండ్లలో ఉండే పోషక విలువలను దృష్టిలో పెట్టుకొని రేషన్‌ షాపుల్లో గుడ్లు పంపిణీ చేయాలని నేషనల్‌ ఎగ్‌ చికెన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఈసీపీసీ) అధ్యక్షుడు డాక్టర్‌ బాలస్వామి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే నెలకు 30 గుడ్లు అందజేయనున్నారు.

 ఇది కూడా చదవండి: మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవీస్ వీడియోస్ వైరల్

 రేషన్‌ షాపు అనగానే మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేది బియ్యం, గోదుమలు, పప్పులు, చక్కెర అయితే ఇక మీదట కోడిగుడ్లు కూడా రేషన్‌ షాపుల్లో దర్శనమివ్వనున్నాయా అంటే అవుననే అంటున్నారు నేషనల్‌ ఎగ్‌ చికెన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఈసీపీసీ) అధ్యక్షుడు డాక్టర్‌ బాలస్వామి. గుడ్డు బలవర్ధకమైన ఆహారం. గుడ్డులో అనేక పోషకాలుంటాయి. నాన్‌వెజ్‌ తిననివారు సైతం కోడిగుడ్డు తినడానికి ఆసక్తి చూపుతారు. అందులోనూ ఉడికించిన గుడ్డును చిన్నపిల్లలు మొదలు పెద్దవారి వరకు ఇష్టంగా తింటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రేషన్‌ షాపుల్లో నిత్యవసర వస్తువులతో పాటు కోడిగుడ్లను కూడా అందజేయాలని ఎన్‌ఈసీపీసీ కోరుతోంది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ఎదుట ఉంచినట్లు తెలిపారు.

 ఇది కూడా చదవండి: యూపీఎస్సీ సివిల్స్‌ 2025 నోటిఫికేషన్‌ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే!

ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి 6 గుడ్లు, అంగన్‌వాడీల్లో గర్భిణులకు రోజుకు 2 గుడ్లు, పనికి ఆహార పథకంలో పనిచేస్తున్న వారికి నెలకు 30 గుడ్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన ఆహారపదార్థాలతో పోలిస్తే ఎన్ని గుడ్లు తిన్నా ఆరోగ్య సమస్యలు రావని, గుడ్డు సంపూర్ణ పౌష్టికాహారమని, కొలెస్ట్రాల్​పెరుగుతుందన్న అపోహను వీడాలన్నారు.​రేషన్‌ కార్డు ద్వారా ప్రజలకు కూడా నెలకు కనీసం 30 గుడ్లు అందిస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా ఉంటారని చెప్పుకొచ్చారు. తగిన పోషకాలు వారికి అందుతాయని వివరించారు. అందుకే అన్ని ప్రభుత్వాలకు ఈ ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు.


ఇది కూడా చదవండి: చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో అలిపిరి దాడి సూత్రధారి మృతి


అయితే ఎన్‌ఈసీపీసీ తాజా ప్రతిపాదననపై రేవంత్‌ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, అంగన్‌వాడీల్లో విద్యార్ధులకు, గర్భిణులకు ప్రభుత్వం ఉచితంగా గుడ్లు అందిస్తుంది. రేషన్‌ కార్డుల ద్వారా కూడా గుడ్లు సప్లై చేసే ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తే సామాన్యులకు పౌష్టికాహారమందుతుందనడంలో సందేహం లేదు. అయితే  ఎన్‌ఈసీపీసీ అందించే గుడ్లను రేషన్ కార్డు దారులకు కూడా ఉచితంగా ఇస్తారా? లేదా సబ్సిడీతో పంపిణీ చేస్తారా? అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే రేషన్‌ షాపుల ద్వారా గుడ్లు పంపిణీ చేసే కార్యక్రమానికి రేషన్‌ డీలర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్నది కూడా తేలాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారో తెలుసా ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు