/rtv/media/media_files/2026/03/30/gold-man-2026-03-30-16-52-39.jpg)
Konda Vijay Kumar and gold man surya-bhai
Surya Bhai Fake Gold : ఇటీవల కొంతమంది ఒంటినిండా బంగారు నగలు ధరించి గోల్డ్‌మ్యాన్ అంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అయితే వారి ఒంటినిండా ఉన్న బంగారాన్ని చూసి ఆడవారు కూడా కుళ్లుకుంటున్నారు. ఇళా ఒంటినిండా నగలతో తిరిగే మగవాళ్లు తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా ఇతర రాష్ర్టాల్లోనూ ఉన్నారు. అయితే పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు కొంతమంది గోల్డ్‌మ్యాన్‌లను చూసి తామేందుకు అలా పాపలర్ కాకుడదని ప్రయత్నించి చివరికి ఐటీ అధికారులకు చిక్కారు. చిక్కితే చిక్కారు..కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే వారి ఒంటిమీద ఉన్నది బంగారం కాదట.. అంతా రోల్డ్ గోల్డేనట.
తాజాగా గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ బండారాన్ని బయటపెట్టారు ఐటీ అధికారులు. అతడి ఒంటిపై ఉన్న బంగారం అంతా నకిలీదే అని తేల్చారు. సూర్యాభాయ్ ఒంటినిండా నగలతో అందర్నీ ఆకర్షించాడు. నిత్యం ఇంటర్వ్యూలు మీడియాలో పాపులర్ అయ్యాడు. ఇటీవల తెలంగాణ హకీ చీఫ్ కొండా విజయ్ కుమార్ కూడా ఒంటినిండా నగలతో కస్టమ్ అధికారులకు దొరికిపోయిన సందర్భంలో సూర్యాభాయ్ వ్యవహారం కూడా బయటకు వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకున్న ఐటీ అధికారులు సూర్యాభాయ్ బండారాన్ని ఐటీ అధికారులు బయటపెట్టారు. అతడి ఒంటి మీద ఉన్నది అసలు బంగారం కాదని నకిలీది అని ఐటీ అధికారులు తేల్చడం సంచలనంగా మారింది. తెలంగాణ గోల్డ్ మ్యాన్ అని చెప్పుకుంటూ తిరిగిన కొండా విజయ్ గుట్టు రట్టు కావడంతో ఐటీ అధికారులు రాష్ర్టంలో ఉన్న ఇతర గోల్డ్ మెన్‌లపై కన్నేశారు. ఇందులో భాగంగానే పాతబస్తికి చెందిన‘గోల్డ్ మ్యాన్’ సూర్యాభాయ్‌కు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో సూర్యాభాయ్. ఐటీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఇక్కడి వరకు అంతా బానే జరిగింగి. విచారణకు వచ్చిన సూర్యాభాయ్‌ని అధికారులు ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సూర్యాభాయ్ ఒంటిమీద ధరిస్తున్న నగలు ఒరిజనల్ కాదాని అవన్నీ నకిలీ అని ఐటీ అధికారులు తేల్చారు. కేవలం బిల్డప్ కోసం మాత్రమే ఒంటి నిండా గోల్డ్ ధరించి సోషల్ మీడియాలో పాపులర్ అయినట్లు తేల్చారు. కాగా, సూర్యాభాయ్ ఎప్పుడూ ఒంటి నిండా కోటి రూపాయల విలువ చేసే ఆభరణాలు ధరిస్తానని యూట్యూబ్‌లో ఇంటర్వ్యూ లో ఊదరగట్టాడు. అయితే ఐటీ విచారణలో మాత్రం అవన్నీ సిల్వర్, కాపర్ నగలని తేల్చారు. వాటికి గోల్డ్ కోటింగ్ వేసి బంగారువి అని నమ్మి్స్తూ వస్తున్నాడని తెలిపారు.
అద్దె ఇల్లు...
ఇదిలా ఉండగ సూర్యాభాయ్ ఆస్తులపై కూడా ఐటీ అధికారులు ఆరాతీశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.అతని దగ్గర పలు రకాల కార్లు ఉండటంతో వాటి గురించి ఐటీ అధికారులు ఆరా తీశారు. అయితే ఆ కార్లన్నికూడా ల్యాండ్ సెటిల్‌మెంట్ల ద్వారా వచ్చినవని విచారణలో తేల్చారు. అంతేకాకుండా సూర్యాభాయ్ కి సొంత ఇల్లు కూడా లేదని నెలకు రూ.20 వేలు చెల్లించి అద్దె ఇంట్లో నివసిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
కొండా విజయ్ ది అంతే...
తెలంగాణ హకీ చీఫ్ కొండా విజయ్ కుమార్ సైతం నకిలీ బంగారంవేసుకుని హల్ చల్ చేసినట్లు అధికారులు తేల్చారు. ఆయన ఒంటిపై ఉన్నవన్నీ ఫేక్ నగలని తేల్చారు. బంగారం పాలిష్ చేసిన నగలు వారి ఒంటి మీద వేసుకున్నట్లు అధికారులు చెప్పారు. కొండా విజయ్ కుమార్ ను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఐటీ, కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా అవన్ని ఫేక్ నగలని తెలింది.
ఓర్వలేకే నిందలు
కాగా, ఈ వివాదంపై సూర్యాభాయ్ స్పందించారు. తను ఇటీవల చేయించుకున్న శ్రీవారి నామాల కడెం మార్కెట్‌లో ఎక్కడా లేదన్నారు. అది చూసి ఓర్వలేకే కొందరు కావాలని తనపై నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. “నేను జీరో నుంచి పైకి వచ్చాను. మళ్లీ సున్నాకి వెళ్లినా నాకు భయం లేదన్నారు. పార్టీల పేరు చెప్పి కబ్జాలు చేయలేదు. సెటిల్‌మెంట్లు చేయలేదన్నారు. నా సొంతంగా సంపాదించుకున్నా. మీడియా పేరుతో కొందరు ఫేక్ న్యూస్ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. మీరు మంచి చేయరు. మంచి చేసేవాడిని చేయనియ్యరు. నా గురించి మీకెందుకు. నేను సమాజానికి మంచి చేస్తున్నా. అందరిలాగా సమాజాన్ని దోచుకోవటం లేదు అంటూ సూర్యాభాయ్ ఫైర్ అయ్యారు.
Follow Us