Gas cylinder exploded : కూకట్‌పల్లిలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి గాయాలు

హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌అమీర్‌లో గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గ్యాస్‌ అక్రమ ఫిల్లింగే కారణమని తెలుస్తోంది.  ఓ షాపులో చిన్న సిలిండర్లలోకి అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

New Update
Gas cylinder exploded in Kukatpally

Gas cylinder exploded in Kukatpally

Gas cylinder exploded: హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌అమీర్‌లో గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గ్యాస్‌ అక్రమ ఫిల్లింగే దీనికి కారణమని తెలుస్తోంది.  ఓ షాపులో డొమెస్టిక్ సిలిండర్ నుంచి చిన్న చిన్న సిలిండర్లలోకి అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్‌ నింపుతున్న సమయంలో గ్యాస్‌లీకై ఒకసారిగా భారీ శబ్ధంతో సిలిండర్‌ పేలింది.

Also read :  Rohit sharma : రోహిత్ శర్మ ముందు భారీ రికార్డు.. ఒక్క సెంచరీ చేస్తే చాలు!

Also Read :  విడదల రజనీపై విచారణ.. అనుమతి కోసం గవర్నర్ కు లేఖ

దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బైక్‌ల మీద ఉన్నవారు బైకులు వదిలేసి పరుగుందుకున్నారు. పేలుడు ధాటికి షాపు మొత్తం ధ్వంసమైపోయింది. షాపు శిథిలాలు రోడ్డుపైకి దూసుకురావడంతో రోడ్డుపైన వెలుతున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ  క్షతగాత్రుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పేలుడుపై దర్యాప్తు చేపట్టారు.   వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: ఉదయం తులసి ఆకులను నమిలితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇది కూడా చదవండి: ఈ విత్తనాలను తింటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు