/rtv/media/media_files/2024/10/21/VkWnYXyDEwipiLVpjaVg.jpg)
సాధారణంగా కాలేజీలు, స్కూల్ మెస్‌లో పురుగులు, తల వెంట్రుకలు దర్శనమిస్తుంటాయి. అయితే హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ మెస్‌లో బిర్యానీలో కప్ప దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ట్రిపుల్‌ఐటీలోని కదంబ మెస్‌లో భోజనం చేద్దామని విద్యార్థులు కూర్చున్నారు.
ఇది కూడా చూడండి: విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్
Shocked and horrified! Found a frog in my friend's meal today at Kadamba Mess (IIIT Hyderabad). This is completely unacceptable and poses a serious health risk! @cfs_telangana, please take immediate action! #FoodSafety #Unhygienic #Hyderabad #IIITHyderabad pic.twitter.com/VCCKM0kuob
— ram manohar (@manoharrocksss) October 17, 2024
కలకలం రేపుతున్న కప్ప..
ఓ విద్యార్థికి వడ్డించిన చికెన్ బిర్యానీ ప్లేట్‌లో కప్ప దర్శనమివ్వడంతో షాక్ అయ్యారు. చికెన్ ముక్కకి ఎలా మసాలా పట్టి ఉంటుందో అలాగే కప్ప కూడా కనిపించింది. కప్ప బిర్యానీ ఫొటోలను ఆ విద్యార్ధులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవున్నాయి. ఈ ఘటన 16వ తేదీన జరిగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చూడండి: ప్రియురాలిని చూసి సృహ తప్పిన ప్రియుడు.. తర్వాత ఏమైందంటే?
మెస్‌లో శుభ్రత పాటించడం లేదనీ ఇప్పటికే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డించే ఆహారంలో ఇలాంటి పురుగులు, కప్పలు వస్తున్నాయన్నారు. ఆహార విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ట్రిపుల్‌ఐటీ మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఇది కూడా చూడండి: మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు
ఇదిలా ఉంటే ఇటీవల బేగంపేట ప్రకాశ్ నగర్‌లోని బాలయ్య చికెన్ సెంటర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. వందల కేజీల కొద్దీ కుళ్లిపోయిన కోడి మాంసాన్ని గుర్తించారు. రోజుల కొద్దీ ఫ్రిడ్జ్‌లలో నిల్వ ఉంచిన చికెన్‌తో పాటుగా కొవ్వు పదార్థాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన కోడి మాంసానికి కెమికల్స్ వేసి ఆ చికెన్‌ను నగరంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మద్యం దుకాణాలు, బార్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
ఇది కూడా చూడండి:Jammu: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి