Shakeel Arrest:: తల్లి మృతి.. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అరెస్ట్!

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన షకీల్‌ ను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా  గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్‌ తల్లి బుధవారం కన్నుమూశారు.

author-image
By Krishna
New Update
shakeel mother

shakeel mother

Shakeel Arrest:

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.  దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన షకీల్‌ ను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా  గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్‌ తల్లి బుధవారం కన్నుమూశారు. గురువారం అచన్‌పల్లిలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.  అయితే తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్‌కు కాగా.. అక్కడికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కాగా కొన్ని నెలలుగా షకీల్‌ దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఆయనపై పోలీసులు గతంలో లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.  

Also Read: టాప్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీబ్యూటీ..

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BREAKING: అఘోరీకి బిగ్ షాక్.. న్యాయమూర్తి ఆదేశాలతో లింగ నిర్ధారణ పరీక్షలు.. ఏం తేలిందంటే?

చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరీకి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమన్నారు. దీంతో లింగనిర్ధారణ పరీక్షలు చేయించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. 

New Update
Lady Aghori Varshini

Lady Aghori Sri Varshini Arrest

BREAKING: చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు  తరలించే అవకాశం ఉంది. 

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి భరోసా సెంటర్ అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. ఇదే విషయంపై అఘోరీ తరఫు లాయర్ మాట్లాడుతూ.. ‘‘కోర్టులో ఇప్పుడు వాదోపవాదనలు ఏం జరగలేదు.  కోర్టు కేవలం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించి పూర్వపరాలు పరిశీలించి కేసు వాదించాలా లేదా అనేది జరుగుతుంది. కోర్టు తరఫున అడ్వకేట్‌ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు నన్ను అపాయింట్ చేసింది. బెయిల్ గురించి ఇప్పుడే చెప్పలేం. కేసుకు సంబంధించి అన్నీ పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది. ’’ అని చెప్పుకొచ్చారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment