GHMC Council Meeting : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. అయితే సమావేశం మొదలైన వెంటనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతామని మేయర్ చెప్పగా.. అందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ సందర్భంగా…. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఏకపక్షంగా బడ్జెట్ పై చర్చ లేకుండా ఏ విధంగా ఆమోదిస్తారని ప్రశ్నించారు.ముందు ప్రజా సమస్యలపై మాట్లాడాలని రెండు పార్టీల సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్.. బీఆర్‌ఎస్ సభ్యుల నుంచి ప్లకార్డులను లాక్కొని చించేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు. కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మేయర్ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా యత్నించారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో రసాభాస మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
Also Read: TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే!
సమావేశం మొదలైన ఐదు నిమిషాల్లోనే తీవ్ర గందరగోళం నెలకొనడంతో మార్షల్స్ కౌన్సిల్ మీటింగ్‌లోకి ప్రవేశించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు తోసుకోవడంతో పాటు దుర్భాషలాడుకున్నారు. మేయర్ పోడియంపై బీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులు విసిరారు. వెంటనే మార్షల్స్ అక్కడకు చేరుకుని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Also Read: Mazaka Movie: రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !
ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్పొరేటర్లను అరెస్ట్ చేయటానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్‌లను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.“కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా? గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయలేదు. మరోసారి అవే కాగితాలపైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా? పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజావసరాలను కూడా సరిగ్గా నిర్వహించటం లేదు. జిహెచ్ఎంసి అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు” అని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Deep Seek: డీప్ సీక్ వెనుక అందమైన అమ్మాయి..టెక్ సంచలనం
మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. భిక్షాటన చేస్తూ పలువురు కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయంకు చేరుకున్నారు. జీహెచ్ఎంసీ పరిస్థితి ఘోరంగా ఉందని విమర్శించారు. తమ డివిజన్లకు నిధులు కేటాయించటం లేదని ఆరోపించారు