/rtv/media/media_files/2025/04/07/i7llBjtmWu5y6xa78PZX.jpg)
Famous hotel damaged biryani..
Be careful : హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అంతేకాదు హోటల్ యజమన్యాలు సైతం కల్తీలతో పాటు పాచిపోయిన, నిల్వచేసిన పదార్థాలలతో బిర్యానీ వంటివి వండుతున్నారు. అపరిశుభ్రత, నాసిరకం పదార్థాల వాడకం, సరైన నిల్వ లేకపోవడం, చెడిపోయిన పదార్థాలతో ఆహార పదార్థాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చిన్న బడ్డీ కొట్టు నుంచి బడా హోటల్స్ వరకు అదే ఇదే తంతు. ఏమాత్రం సుచీ శుభ్రత లేకుండా నాసికరం వంటకాలు విక్రయిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని ఓ ఫేమస్ హోటల్‌లో పాచిపోయిన బిర్యానీ విక్రయించారు.
ఓ కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేయగా.. హోటల్ నిర్వహకులు పార్శిల్ కట్టి ఇచ్చారు. అయితే ఇంటికి వెళ్లి చూడగా.. బిర్యానీ మెుత్తం పాడైపోయింది. పాచిపోయిన వాసన రావటంతో పొట్లంతోనే కస్టమర్ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ హోటల్ నిర్వహకులను ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో హోటల్ యాజమాన్యంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెడిపోయిన బిర్యానీ ఇచ్చి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతావా..? అంటూ ఫైరయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బయట ఫుడ్ తినేవారు, పార్శిల్ తెచ్చుకొని తినేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పాడైపోయిన రైస్‌తో వంటకాలు చేస్తున్నారని.. ఓసారి చెక్ చేసుకోవాలని చెబుతున్నారు.
Also Read: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!
హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీ అనేది ఒక ఆందోళనకరమైన సమస్యగా మారింది. నగరంలో టీ పొడి, కాఫీ, చక్కెర, పాలు, తేనె, సుగంధ ద్రవ్యాలు, నూనెలు, ఐస్‌క్రీమ్‌లు, ఇతర ఆహార ధాన్యాలు వంటి నిత్యావసర వస్తువులు కల్తీకి గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ బ్రాండ్‌ల పేరుతో కల్తీ ఉత్పత్తులను సూపర్ మార్కెట్‌లు, దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. టీ పొడిలో కొబ్బరి పొట్టు వంటివి కలుపుతున్నారు. పండ్లను త్వరగా పండించడానికి హానికరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నారు. నూనెలను పదే పదే వేడి చేయడం వల్ల హానికరమైన రసాయనాలు ఏర్పడుతున్నాయి. మసాల పొడులలో కృత్రిమ రంగులు కలుపుతున్నారు. రంగు లేదా వాసనలో తేడా ఉంటే ఆహారాన్ని ఉపయోగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!