ఫామ్ హౌస్ కేసుపై మంత్రి జూపల్లి ఫైర్.. చట్టం ఎవరికి చుట్టం కాదంటూ!

జన్వాడ ఫామ్ హౌస్ కేసుపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. ఫాం హౌస్‌‌లో వేడుకలకు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి ఈవెంట్ పర్మిషన్ తీసుకోలేదని.. అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరిగినట్లు అధికారులు గుర్తించారని అన్నారు.

New Update
Jupally Krishna Rao

జన్వాడ ఫామ్ హౌస్ కేసుపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపై స్పందించి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేయడం సాధరణ విషయమేనన్నారు. ఈ మేరకు చట్టం ఎవరికి చుట్టం కాదని తెలిపారు. విశ్వాసనీయ సమాచారం అందడంతో ఎస్వోటీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించారన్నారు.

ఇది కూడా చదవండి: Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా

రొటీన్ ప్రాసెస్‌లో భాగంగా అధికారులు సోదాలు చేశారని తెలిపారు. కాగా ఫాం హౌస్‌‌లో వేడుకలకు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి ఈవెంట్ పర్మిషన్ తీసుకోలేదని.. ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరిగినట్లు అధికారులు గుర్తించారని అన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (విదేశీ మద్యం) ఎస్వోటీ పోలీస్‌లు, ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇంపోర్టెడ్ లిక్కర్‌కు డ్యూటీ ఫ్రీ బిల్స్ కూడా చూపించలేదని అన్నారు. 

కేసీఆర్ రియాక్షన్

ఇది కూడా చదవండి: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా? 

ఇదిలా ఉంటే జన్వాడ ఫామ్‌హౌస్‌ పార్టీ ఇష్యూపై కేసీఆర్ సైతం రీసెంట్‌గా సీరియస్ అయ్యారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్‌పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలు ఎలా నిర్వహిస్తున్నారంటూ డీజీపీకి ఫోన్ చేసి ఆరాతీశారు.  వెంటనే సోదాలు ఆపాలని డీజీపీని కోరారు. 

కేటీఆర్ రియాక్షన్

ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు

జన్వాడ ఫాంహౌస్ పార్టీపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ప్రెస్ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపావళికి ఇంట్లో దావత్ చేసుకుంటే తప్పేంటని అని అన్నారు. అయితే అది ఫాంహౌస్ కాదని.. తన బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు అని క్లారిటీ ఇచ్చారు.

గృహప్రవేశం చేసినప్పుడు వెళ్లలేదని.. అందువల్ల ఇప్పుడు ఫ్యామిలీకి పార్టీ ఇచ్చాడని తెలిపారు. ఆ పార్టీలో ఆడవారు, మగవారు ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీలో తన అత్తమ్మ, భార్య పిల్లలు ఉన్నారని తెలిపారు. కొందరు దాన్ని రేవ్ పార్టీ అంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. కుట్రలతో తమ గొంతు నొక్కుతున్నారన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులు, బంధువుల మీద కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. 11 నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. ఉద్యమ స్ఫూర్తితో తాము కేసులకు భయపడబోమని తెలిపారు. 

ఇది కూడా చదవండి: మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్!

తాను వెనక్కి తగ్గేనని.. కాంగ్రెస్‌ను నిలదీస్తూనే ఉంటానని అన్నారు. చేతనైతే రాజకీయంగా తలపడండని సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలం అయిందని ఆరోపించారు. ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించామని.. ఇలాంటి కుట్రలకు తాము భయపడమని చెప్పుకొచ్చారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు