SLBC Tunnel Rescue Operation : శ్రీశైలం టన్నెల్ ప్రమాదం జరిగి 15 రోజులు కావస్తోన్న అందులో చిక్కుకున్న వారి జాడ ఇంతవరకు తెలియరాలేదు. ఆ 8 మంది జాడకోసం 11 రెస్క్యూ బృందాలు, సుమారు 600 మందికిపైగా సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. మానవ పరిజ్ఞానంతో పాటు , సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక టెక్నాలజీ, జాగిలాలు, రోబోలు ఇలా అన్ని రకాల ఆఫరేషన్లు కొనసాగిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు.
Also Read: ఎలన్ మస్క్‌ను రంగంలోకి దింపిన ట్రంప్.. సునీతా విలియమ్స్ తీసుకొచ్చే డేట్ ఫిక్స్!
రాడార్ ద్వారా టన్నెల్‌లో గుర్తించిన కొన్ని స్థానాల్లో మట్టిని తొలగించినప్పటికీ కార్మికుల ఆచూకీ కనిపించలేదు. కేరళ నుంచి రప్పించిన ప్రత్యేక జాగిలాలు సైతం కార్మికుల జాడను గుర్తించలేకపోయాయి. రాడార్ మిషన్ ద్వారా గుర్తించిన స్థలాన్నే జాగిలాలు సైతం గుర్తించినా స్పష్టత రాలేదని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. మరోసారి పెద్దసంఖ్యలో రెస్క్యూ బందాలు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. టీబీఎంకింద శకలాల తొలగింపు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మద్రాస్ ఐఐటీ బృందంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం దక్కలేదు. ఎన్‌జీఆర్‌ఐ, జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, క్యాడవర్ డాగ్ బృందం, ర్యాట్‌మైనర్స్, రోబోటిక్ రంగాల నిపుణులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కార్మికుల జాడను మాత్రం గుర్తించలేదు.
Also Read: కాలిఫోర్నియా గవర్నర్ రేసులో యూఎస్ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పని సమయంలో సంభవించిన ఘోర ప్రమాదం ఇంకా అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నీటి ముంపు, టన్నెల్ కూలిన కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ ఘటనకు సంబంధించిన రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి.ఎస్ఎల్‌బీసీ వద్ద జరిగిన ప్రమాదం ఒక జాతీయ విపత్తు అని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం, సహాయక చర్యల్లో ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగిస్తున్నట్టు వివరించారు. శనివారం ఉదయం అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్‌ను సందర్శించారు. వివిధ రంగాల నుంచి పనిచేస్తున్న రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
Also Read: ఎస్సార్ఎస్పీ కాలువలో దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు!
సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి ఉన్న పురోగతి గురించి అధికారులు మంత్రికి వివరించారు. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, క్యాడవర్ డాగ్ బృందం, ర్యాట్ మైనర్స్, రోబోటిక్ రంగాల నిపుణులతో ఇత్తమ్ చర్చించారు. సహాయక చర్యలు వేగంగా జరగకపోవడానికి గల కారణాలు, అడ్డంకులు, వాటిని అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. సహాయక చర్యల్లో అవాంతరాలను అధిగమిస్తూ.. వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. సొరంగం లోపల సరిగ్గా ఆక్సిజన్ స్థాయి లేకపోవడం, నీరు అధికంగా ఊరటం, టీబీఎం లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. అయినా సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో పనిచేసే కార్మికులు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. త్వరగా కార్మికులను గుర్తించేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఎంత నిధులు ఖర్చు అయిన సరే ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. టీబీఎం శకలాలు రాళ్లు, మట్టి, నీళ్లలో కూరుకుపోయి ఉండటంతో.. రెస్క్యూ చేసే సిబ్బందికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు.
టన్నెల్ నుంచి కుళ్లిపోయిన వాసన?
15 రోజులుగా SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆరేషన్ కొనసాగుతూనే ఉంది. గల్లంతైన 8 మంది కార్మికుల మృతదేహాల కోసం నిరంతరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు-- టన్నెల్‌లో సీ ఫేజ్ వాటర్ ఉబికి వస్తున్నది. GPR చూపించిన ప్రాంతంలో 7 అడుగుల మేర రెస్క్యూ టీమ్ తవ్వకాలు చేపట్టింది. గత కొన్ని రోజులుగా -- టన్నెల్‌లోనే NDRF, SDRF, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్స్ రెస్క్యూ ఆఫరేషన్ కొనసాగిస్తున్నాయి.
-- రెండో రోజు టన్నెల్‌లోకి వెళ్లిన క్యాడవర్ డాగ్స్ గతంతో ర్యాడర్ గుర్తించిన ప్రాంతాలనే గుర్తించాయి. మరోవైపు -- టన్నెల్ నుంచి వస్తున్న కుళ్లిపోయిన వాసన వస్తున్నట్లు రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. వాసన మరింత పెరిగితే రెస్క్యూ ఆఫరేషన్ కొనసాగించలేని పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.
రంగంలోకి రోబోలు..
రోబోటిక్ నిపుణులతో సహాయక చర్యలు చేపట్టేందుకు రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రోబోలను వెంటనే రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలో అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న అధికారులు, నిపుణులు, సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు. తాను మళ్లీ 11వ తేదీన వస్తానని.. వీలైతే ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వస్తారని స్పష్టం చేశారు.
Also Read: ఏడాదిలోపు చిన్నారుల్లో శ్వాసకోస సమస్యలు..ఎందుకిలా?