ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై రంగంలోకి దిగిన ఈడీ.. కేటీఆర్‌పై మరో కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం. కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్ కుమార్, అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇది కూడా చూడండి: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే! Formula E-Car Race Scam Case ఇదిలాఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ ఏసీబీ కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏ1 కేటీఆర్, ఏ2 అర్వింద్ కుమార్, ఏ3 బీఎల్‌ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా శుక్రవారం విచారణ జరిగింది. ప్రాథమిక దర్యాప్తు పూర్తికావడం వల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు. ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! మరోవైపు కేటీఆర్ తరఫున సీనియర్ లాయర్ సుందరం, గండ్ర మోహన్‌రావు, ప్రభాకర్‌రావు వాదనలు వినిపించారు. కేటీఆర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని.. ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోర్టును కోరారు. అయితే ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. డిసెంబర్ 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో విచారణ కొనసాగించవచ్చొని పేర్కొంది. 10 రోజుల్లోనే కౌంటర్ దాఖలు చేయాని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 27కు వాయిదా వేసింది. అయితే మళ్లీ తాజాగా కేటీఆర్‌పై ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు