/rtv/media/media_files/2025/02/17/q07l9VT8yrbVUM2NJhOm.jpg)
Election Commission
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు భారత ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఎం.ఎస్. ప్రభాకర్ రావు హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీ కాలం మే 1తో ముగియనుంది. దీంతో ఈసీ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 28న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల స్క్రూటిని 7న ఉంటుంది. నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు ఏప్రిల్ 9 లాస్ట్ డేట్. 23న ఎన్నిక నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. కౌంటింగ్ ను 25న నిర్వహించి విజేతను ప్రకటిస్తారు.
ఇది కూడా చదవండి: TG Education: తెలంగాణలో మరో రెండు IIITలు.. ఎక్కడో తెలుసా?
తెలంగాణలో మరో కీలక ఎన్నిక.. షెడ్యూల్ విడుదల
— Telugu Galaxy (@Telugu_Galaxy) March 24, 2025
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
పోలింగ్: ఏప్రిల్ 23
కౌంటింగ్: ఏప్రిల్ 25#Telangana #Hyderabad #BRS #KTR #HarishRao #Congress #RevanthReddy #BJP pic.twitter.com/F3dvK3sV8C
ఎంఐఎంకే ఎమ్మెల్సీ?
ఇటీవల తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఇందులో మూడు కాంగ్రెస్ కు, ఒకటి సీపీఐకు, మరొకటి బీఆర్ఎస్ కు దక్కింది. అయితే.. ఆ సమయంలో ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ అవగాహనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దాని ప్రకారం ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరిస్తే.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి సపోర్ట్ చేస్తామని హస్తం నేతలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
ఇది కూడా చదవండి: PawanKalyan: తమిళనాడులో జనసేన.. పవన్ సంచలన ప్రకటన!
ఇందులో భాగంగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీకి దించకుండా.. ఎంఐఎంకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే.. బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలో ఎలాంటి వ్యూహం అవలభించాస్తాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.
(mlc elections in telangana | election-commison-of-india | telugu-news | telugu breaking news)