/rtv/media/media_files/2026/05/19/ebola-virus-2026-05-19-17-43-41.jpg)
Ebola Virus
Ebola Virus : హైదరాబాద్ నగరంలో ఎబోలా వైరస్ (Ebola Virus) భయాలు ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించాయి. ఎబోలా తరహా ప్రాథమిక లక్షణాలతో నగరంలోని అపోలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఇద్దరు వ్యక్తులను రాత్రికి రాత్రే సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రికి తరలించారు. సదరు బాధితులకు ఆఫ్రికా దేశాల ప్రయాణ నేపథ్యం (Travel History) ఉండటం, దానికి తోడు ఎబోలా అనుమానిత లక్షణాలు కనిపించడంతో నగర వైద్య ఆరోగ్య వర్గాలు వెంటనే హై అలర్ట్ ప్రకటించాయి.
బాధితులలో లక్షణాల తీవ్రతను గమనించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం తక్షణమే స్పందించి, ఎబోలా నిబంధనల (Protocols) ప్రకారం వారిని గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేక ఎబోలా ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందాల నిరంతర పర్యవేక్షణలో వారికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యుల ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ బాధితులకు తీవ్రమైన జ్వరం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఎబోలా ప్రోటోకాల్ ప్రకారం బాధితుల రక్తం, లాలాజలం శాంపిల్స్‌ను వైద్యులు ఇప్పటికే సేకరించారు. వైరస్ ఉనికిని తక్షణమే నిర్ధారించే పరీక్షల కోసం ఈ నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీ (CCMB) ల్యాబొరేటరీకి పంపించారు. ఈ పరీక్షల నివేదికలు (Reports) రావడానికి కనీసం 24 నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఇక్కడి ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్ అని తేలితే, ఆ ఫలితాలను మరింత పక్కాగా ధృవీకరించుకోవడం కోసం శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపించనున్నారు.
Follow Us