/rtv/media/media_files/2026/03/15/drug-party-at-former-mla-pilot-rohit-reddy-farmhouse-2026-03-15-06-49-54.jpg)
Drug party at former MLA Pilot Rohit Reddy's farmhouse.
Former MLA Pilot Rohit Reddy : తాండూరు మాజీ ఎమ్మెల్యే (బీఆర్‌ఎస్) పైలెట్ రోహిత్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనకు చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దేశవ్యాప్తంగా కలకలం రేపగా తాజాగా డ్రగ్స్ పార్టీ, కాల్పుల ఘటనతో మరోసారి సంచలనంగా మారింది. వివరాల ప్రకారం మొయినాబాద్‌లోని పైలెట్ రోహిత్ రెడ్డి కి చెందిన ఫాంహౌస్ లో డగ్స్ పార్టీ జరుగుతుందన్న సమచారంతో శనివారం రాత్రి ఈగల్ బృందాలు మెరుపుదాడులు నిర్వహించాయి. ఆ సమయంలో డ్రగ్స్ పార్టీలో ఉన్న ఒక వ్యక్తి మొదట ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరపడంతో పాటు నేరుగా ఈగల్ బృందంపై మూడ రౌండ్లు కాల్పులు జరిపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి గందరగోళానికి దారి తీయడంతో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌వోటీ) సమాచారం అందించారు. దీంతో వారు రంగంలోకి దిగి సోదాలు చేయగా సోదాల్లో 2 గ్రాముల కోకైన్, ఇతర మత్తు పదార్థాలతోపాటు రివాల్వర్ లభించినట్లు తెలిపారు. కాగా రోహిత్ రెడ్డి సోదరుడు రితీశ్ రెడ్డి లెసెన్స్‌డ్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు. తుపాకీ రితేష్ రెడ్డిది అయినప్పటికీ ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా అక్కడ మొత్తం 9మంది పురుషులతో పాటు ఒక మహిళ డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేశ్ యాదవ్, మొరగనేని రమేశ్, వి.శ్రావణ్ కుమార్, నల్లపనేని విజయ్ కృష్ణ, రితీశ్ రెడ్డి, నీవిత్ శర్మ తదితరులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా మూడు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కావడంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఎపీ ఎంపీ మహేశ్ యాదవ్‌కు డ్రగ్స్ టెస్ట్ చేయగా నెగటివ్ వచ్చిందని, రోహిత్ రెడ్డితో పాటు మరికొంతమందికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా డ్రగ్స్ పార్టీలో కాల్పులు జరపడం పట్ల పోలీసులు సీరియస్ అయ్యారు. ఎవరిని భయపెట్టడానికి కాల్పులు జరిగాయి? అనే కోణంలో ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది.
ఫాంహౌస్‌లో విస్తృత తనిఖీలు
కాగా ఫాంహౌస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఫాంహౌస్‌లోకి ఎవరెవరు వచ్చారు? పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు. అసలు పార్టీ ఎవరు అరెంజ్ చేశారు. వీరంతా కేవలం పార్టీ కోసమే ఇక్కడ సమావేశమయ్యారా? మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల కోసం సీసీటీవీ ఫుటేజీ డీవీఆర్ ను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో మొయినాబాద్ లో భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు బీఆర్‌ఎస్ పాలన హయాంలోనే డ్రగ్స్ దందా ఎక్కువైందని అధికార పార్టీ ఆరోపించడమే కాకుండా దానికి ఆ పార్టీ అగ్రనేతలకు సంబంధం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి ఆరోపిస్తున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే డగ్స్ పార్టీలో పట్టుపడటం బీఆర్‌ఎస్‌కు మింగుడుపడని అంశమనే చెప్పాలి.
Follow Us