/rtv/media/media_files/2026/06/11/bigg-boss-10-season-2026-06-11-17-03-19.jpg)
Bigg Boss 10 Season:
BIG BOSS 10 : బుల్లితెరపై మరో బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్ట్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. టాలీవుడ్ మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మళ్లీ వచ్చేస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేయబోతున్న ఈ సీజన్ లేటెస్ట్ ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈసారి 'దశావతారం' అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. "ఆటలో సవాల్ కాదు... ఈసారి ఆటే సవాల్" అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ అప్పుడే పీక్స్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ పవర్‌ఫుల్ సీజన్‌లో అడుగుపెట్టబోయే ఆ 'దశావతారాలు' ఎవరు..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లీక్డ్ లిస్ట్ ఏంటి..? ఈసారి లెక్క ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో రిలీజ్ అయిందో లేదో.. హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ ఒక క్రేజీ లిస్ట్ వైరల్ అవుతోంది. ఈసారి కూడా బుల్లితెర సెలబ్రిటీలతో పాటు జబర్దస్త్ తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ లీక్డ్ లిస్టులో ప్రధానంగా టీవీ సీరియల్ యాక్టర్స్ పల్లవి గౌడ, తేజస్విని గౌడలతో పాటు.. తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించే కమెడియన్స్ ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు రీసెంట్‌గా సోషల్ మీడియాలో తెగ కాంట్రవర్సీ అయిన 'నందూస్ వరల్డ్' నందు, యూట్యూబ్ ట్రెండింగ్ స్టార్ రాయల్ ఎంసీ రమణ, శివ్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రైటర్ కడలి సత్యనారాయణ కూడా ఈ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక బిగ్‌బాస్ 7 సీజన్‌లో తన ఆటతో, డ్యాన్స్‌తో సందడి చేసిన ఆట సందీప్ వైఫ్ జ్యోతి కూడా ఈసారి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సీజన్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్‌లో వినిపిస్తున్న అత్యంత క్రేజీ అండ్ కాంట్రవర్షియల్ పేరు.. సీనియర్ హీరోయిన్ కస్తూరి. తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన కస్తూరి.. తెలుగులో 'గృహలక్ష్మి' సీరియల్‌తో ఇంటింటికీ బాగా దగ్గరయ్యారు. సినిమాలతో పాటు పలు అంశాలపై బోల్డ్ అండ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే కస్తూరి.. ఇప్పటికే తమిళ బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హడావిడి చేశారు. మరి ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ 10 లోకి ఆమె అడుగుపెడితే గనక.. హౌస్‌లో గొడవలు, డిబేట్లు, స్ట్రాటజీలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని, ఇక లెక్క వేరేలా ఉంటుందని ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయిపోతున్నారు. అయితే వీరందరిలో ఎవరు నిజంగా హౌస్‌లోకి వెళ్తారనేది మాత్రం మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుంది.
మరోవైపు ఈ సీజన్‌లో కామనర్స్ ఎంట్రీపై కూడా ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. లాస్ట్ సీజన్‌లో 'అగ్నిపరీక్ష' కాన్సెప్ట్‌తో కామనర్స్‌కు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. అంతేకాదు బిగ్‌బాస్ 9 విన్నర్‌గా ఒక సామాన్యుడే గెలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు. సెలబ్రిటీలకు ఏమాత్రం తగ్గకుండా టాస్కుల్లో రాణించి, మైండ్ గేమ్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుని కల్యాణ్ పడాల బిగ్ బాస్ కప్ అందుకున్నాడు. దీంతో అదే విన్నింగ్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2'ను త్వరలోనే ప్రారంభించబోతున్నారట. ఈ సెలెక్షన్ ప్రాసెస్‌కు జడ్జీలుగా శివాజీ, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ లాంటి ఎక్స్ కంటెస్టెంట్స్ వ్యవహరించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ 'దశావతారం' సీజన్‌లో కూడా ఎక్కువ మంది కామనర్స్‌కే ఛాన్స్ ఇచ్చే యోచనలో మేకర్స్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ అగ్నిపరీక్ష ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత.. సరికొత్త హంగులతో ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 10 గ్రాండ్‌గా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈసారి కొత్త టాస్కులు, కొత్త రూల్స్, కొత్త స్ట్రాటజీస్‌తో గేమ్ పూర్తిగా మారిపోతుందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్‌లో నిజంగా ఎవరు హౌస్‌లోకి వెళ్తారు..? ఈసారి దశావతారం కాన్సెప్ట్‌లో ఎలాంటి మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉండబోతున్నాయి..? కామనర్స్‌కు మళ్లీ ఛాన్స్ దక్కుతుందా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow Us