Delhi : నేడు ఢిల్లీకి భట్టి విక్రమార్క.. అధిష్టానంతో కీలక భేటీ!

TG: ఈరోజు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత 3 రోజుల పాటు జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. కాగా ఇప్పటికే సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే.

New Update
Telangana Elections: ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటారు? భట్టి సంచలన కామెంట్స్..

Bhatti Vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని 3 రోజుల పాటు జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. కాగా ఇప్పటికే సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ తో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. కాగా రేపు సాయంత్రం ఢిల్లీకి చేరుకొని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి కలిసే ఛాన్స్ ఉంది.

Also Read :  సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా!

ఎవరికీ ఏ పదవులు!

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 10 నెలలు గడుస్తున్న రాష్ట్ర కేబినెట్ మాత్రం ఇంకా భర్తీ కాలేదు. ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి వర్గంలో ముఖ్యమైన విద్యాశాఖకు ఇప్పటి వరకు మంత్రి లేడు. దీనిపై పలుమార్లు ప్రతిపక్షాలు బీజేపీ ,  బీఆర్ఎస్ విమర్శలు చేసిన.. చేస్తున్న కాంగ్రెస్ మాత్రం పెద్దగా స్పందించడం లేదు. మరోవైపు  సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తానే మిగిలిన శాఖలకు మంత్రిని అని ఓ మీడియా సమావేశంలో బహిరంగ ప్రకటన చేశారు. కాగా అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్న ఇంకా నామినేటెడ్ పదవులు, మంత్రి వర్గం విస్తరణ కాకపోవడం అనేక చర్చలకు దారి తీస్తోంది.

ఇది కూడా చదవండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!

ఈనాడు కోసం ఆనాడు..

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తమ ఎమ్మెల్యే టికెట్లను వదులుకున్న నేతలు, పార్టీ కోసం పని చేసిన నేతలు.. ఇలా అందరి చూపు నామినేటెడ్ పోస్టులపై ఉంది. మరోవైపు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి కూర్చుకోసం హస్తినలో ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా నామినేటెడ్ పదవులు, మంత్రి వర్గ విస్తరణపై ఎల్లుండి జరిగే సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: గురుకులాల్లో కోడింగ్‌ శిక్షణ.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు !

తెలంగాణవ్యాప్తంగా గురుకులాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు కోడింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. మంగళవారం సెక్రటరీ అలుగు వర్షిణి ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ విద్యా సంవత్సరం నుంచే 238 గురుకుల పాఠశాలల్లో దీన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

New Update
TGSWREIS

TGSWREIS

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు కోడింగ్‌పై శిక్షణ ఇవ్వనుంది. మంగళవారం సెక్రటరీ అలుగు వర్షిణి ఈ విషయాన్ని వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులకు ఇందుకు మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 238 గురుకుల పాఠశాలల్లో కోడింగ్‌ కోర్సుపై శిక్షణ ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. 

గతేడాది మొయినాబాద్‌ గురుకుల పాఠశాలలో మాత్రమే కోడింగ్‌పై శిక్షణ ఇచ్చామని.. ఇప్పుడు అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నామని తెలిపారు. అయితే ఈ శిక్షణ కోసం గురుకుల సంస్థ యూకేలోని లండన్‌కు చెందిన ర్యాస్ప్ బెర్రీపై పౌండేషన్ (RBF) తో ఐదేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు కావాల్సిన స్కిల్స్, కరిక్యులమ్. మానిటరింగ్, టీచింగ్, యాక్షన్ ప్లాన్ వంటి వివిధ అంశాల్లో ఫౌండేషన్ నిర్వహకులు పాలు పంచుకోనున్నారు. 

Also read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఆన్‌లైన్ టూల్స్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించేందుకు అంతా సిద్ధం చేశారు. గురుకుల సంస్థ ఈ కోడింగ్‌ శిక్షనను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రతి పాఠశాలలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా అమలు చేసింది. దీని ఫలితాలు మెరుగ్గా రావడంతో ఫౌండేషన్ ప్రతినిధులను గురుకుల అధికారులు ఒప్పించారు. అలాగే అన్ని పాఠశాలల్లో కంప్యూటింగ్ పాఠ్యాంశాలను రెగ్యులర్‌ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. 

Also Read: బయటపడిన ఫేక్ డాక్టర్.. ఒకే నెలలో ఎంతమంది మృతి చెందారంటే?

గురుకులాల్లో కోడింగ్ శిక్షణలో భాగంగా విద్యార్థులకు 2 గంటల పాటు బోధిస్తారు. మరో రెండు గంటలు ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయిస్తారు. దాదాపు 1.52 లక్షల మంది విద్యార్థులకు కంప్యూటింగ్ పాఠ్యాంశాలను ఒక సబ్జెక్టుగా నేర్పించి పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు జారీ చేస్తారు. అయితే గురుకులాల్లో విద్యార్థులకు కోడింగ్ టెక్నాలజీని నేర్పించడం చరిత్రలో ఇదే మొదటిసారని.. ఇదొక మైలురాయిగ నిలుస్తుందని సెక్రటరీ అలుగు వర్షిణి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కోడింగ్‌ శిక్షణ, బోధన కోసం స్కూల్స్‌లో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌లను కూడా తీసుకొస్తామని చెప్పారు.  

Advertisment
Advertisment
Advertisment