DANA Cyclone: దూసుకొస్తున్న దానా తుపాన్.. 37 రైళ్లు రద్దు..లిస్ట్ ఇదే! దానా తుపాను దూసుకొస్తోంది. వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఏపీలో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే మొత్తం 37 రైళ్లను రద్దు చేసింది ఇండియన్ రైల్వే. By Nikhil 22 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి ఈస్ట్ కోస్ట్ రైల్వే రీజియన్ లో దానా సైక్లోన్ కారణంగా భారీగా రైళ్లను రద్దు చేస్తున్నారు అధికారులు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే 37 రైళ్లను రద్ఉద చేసింది. ఈ రైళ్లలో సికింద్రాబాద్, హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, పాండిచ్చేరి, హౌరా, బెంగళూరు, యశ్వంతపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఉన్నాయి. పూర్తి వివరాలను ఈ కింది లీస్ట్ లో చూడొచ్చు. ఇది కూడా చదవండి: Hydra మళ్ళీ పని మొదలు పెట్టిన హైడ్రా బుల్డోజర్లు.ఈ సారి ఎక్కడో తెలుసా? "Cancellation of Trains due to Cyclone ‘DANA’ over East Coast Railway" @drmsecunderabad @RailMinIndia pic.twitter.com/ivmk2Lt4ny — South Central Railway (@SCRailwayIndia) October 22, 2024 వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఏపీలో ఈ దానా తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అక్టోబర్ 23 నుంచి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 24 రాత్రి నుంచి అక్టోబర్ 25 ఉదయం వరకు 120 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరిస్తున్నారు. రేపు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది చూడా చదవండి: వాహనదారులకు షాక్.. రోడ్లపై తిరగాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందే! "Cancellation of Trains due to Cyclone ‘DANA’ over East Coast Railway" @drmsecunderabad pic.twitter.com/DBN4F5u7oA — South Central Railway (@SCRailwayIndia) October 22, 2024 ఈ 3 రాష్ట్రాలపై ఎఫెక్ట్.. తుపాను విషయమై IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ.. తుఫాను తాకడానికి ఒక రోజు ముందు అక్టోబర్ 23న భారీ వర్షాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఒడిశా-బెంగాల్ తీర ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలలో అక్టోబర్ 24-25 తేదీల్లో 20 సెం.మీ వర్షపాతం నమోదు కావచ్చన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 సెం.మీ కంటే ఎక్కువ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇది కూడా చదవండి: రేవంత్ దూకుడు.. బడ్జెట్లో వెయ్యికోట్లు..మూసీ కాంట్రాక్టు పొంగులేటికే? ఇది కూడా చదవండి: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల అర్హులను తేల్చనున్న యాప్ #indian-railways #south-central-railway మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి