కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్..నిందితులు అరెస్టు!

కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేసి బెదిరించిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌ పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.  సైబర్ నేరగాళ్లు మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించి నకిరేకల్ కు తీసుకువచ్చారు.  

New Update
vemula call

నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు  న్యూడ్ కాల్ చేసి బెదిరించిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు..  కొన్ని క్షణాలపాటు దాన్ని స్క్రీన్ రికార్డు చేసి ఆయనకే పంపి డబ్బులు డిమాండ్ చేశారు.  అయితే అందుకు ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలకు పంపారు.

Also read :  రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

పోలీసులకు ఫిర్యాదు

దీంతో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే వేముల వీరేశం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మధ్యప్రదేశ్‌ పోలీసుల సహకారంతో  నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  సైబర్ నేరగాళ్లు మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు.  అక్కడ వారిని అరెస్ట్ చేసిన పోలీసులు నకిరేకల్ కు తీసుకువచ్చారు.   

Also Read :  కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు