Cricket betting : హఫీజ్ పేటలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

ఐపీఎల్ చుట్టూ లక్షల కోట్లలో వ్యాపారం జరుగుతుంటే మరో పక్క అదే రేంజ్ లో బెట్టింగ్ కూడా నడుస్తుంది. ఐపీఎల్ నేపథ్యంలో నగరంలో జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ SOT పోలీసులు బట్టబయలు చేశారు.

New Update
Cricket betting

Cricket betting

Cricket betting : ఐపీఎల్ చుట్టూ లక్షల కోట్లలో వ్యాపారం జరుగుతుంటే మరో పక్క అదే రేంజ్ లో బెట్టింగ్ కూడా నడుస్తుంది. బెట్టింగ్ ను అణిచివేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ బెట్టింగ్ రాయుళ్లు ఏమాత్రం తగ్గడంలేదు. ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియర్ లీగ్ )జరుగుతున్న నేపథ్యంలో నగరంలో జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ SOT పోలీసులు బట్టబయలు చేశారు. హఫీజ్ పేట లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఎస్ ఓటీ పోలీసులు భార్య, భర్త ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఫేక్ కంపెనీల పేరిట బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి, ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న భార్యభర్తలను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మాడిశెట్టి అజయ్, అతని భార్య సంధ్య కలిసి మూడు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు వీరి అకౌంట్లను పరిశీలించగా, ఏకంగా 40 లక్షల రూపాయల విలువైన బెట్టింగ్ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

Also Read : ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

పోలీసులు బెట్టింగ్ ముఠాను పట్టుకునే క్రమంలో నిందితుల నుంచి రూ. 55,000 నగదు, బ్యాంక్ ఖాతాల్లో రూ.22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.. అంతేకాకుండా.. మొత్తం 7 అకౌంట్లను గుర్తించారు. అజయ్ గతంలోనే నాలుగు సార్లు క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో పట్టుబడ్డాడు. గతంలోనూ బెట్టింగ్ లు నిర్వహిస్తూ పట్టుబడి నాలుగు సార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లినట్లు తెలుస్తుంది.  అయినప్పటికీ, మరోసారి బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు దొరికిపోయాడు.  పోలీసులు ఈ బెట్టింగ్ ముఠాతో సంబంధమున్న ముగ్గురు ఫంటర్లను అదుపులోకి తీసుకుని, వారిని మియాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియా భారీగా విస్తరించిందని స్పష్టమవుతోంది. అధికారులు అలాంటి అక్రమ కార్యకలాపాలపై మరింత నిఘా ఉంచాలని కోరుతున్నారు.

Also Read :  KYC Deadline: రేషన్ కార్డులదారులకు గుడ్‌ న్యూస్‌..ఆ గడువు పొడిగింపు

కాగా రెండు రోజుల క్రితం  హైదరాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. బుధవారం ( మార్చి 26 ) ఇద్దరు బెట్టింగ్ బుకీలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిదగ్గర నుంచి రూ. లక్షా 36 వేలు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లోని అశోక్ నగర్ కి చెందిన లదా, నారాయణగూడకు చెందిన అగర్వాల్ లు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరు నిందితులు మెయిన్ బూకీ అయిన శిరాజ్ బూబ్ నుంచి ఐడీలు తీసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.  

Also Read : ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

Also read :  Ravindra Jadeja: వీడు మగాడ్రా బుజ్జి.. రవీంద్ర జడేజా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు