/rtv/media/media_files/2025/03/17/gyhFZloMlRO5k4TS4Vqw.jpg)
Bhadrachalam
Bhadrachalam : భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆలయ ఈవో, వైదిక కమిటీకి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజంను పర్ణశాలకు బదిలీ చేయడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో ఉత్సవ పనులకు అంకురార్పణను అర్చకులు నిలిపివేశారు. అంకురార్పణ జరపాల్సింది ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజమేనని ఆయన లేకుండా అంకురార్పణ కుదరదని వైదిక కమిటీ తేల్చి చెప్పింది. దీంతో చేసేది లేక సాయంత్రానికి తిరిగి ఆయనను ప్రధాన ఆలయానికి రప్పించారు. ఈ వివాదం వల్ల అంకురార్పణ నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఇంతటితో వివాదం ముగిసిందనుకుంటే సమస్య మరింత జఠిలంగా మారింది.
ఇది కూడా చూడండి: Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
వైదిక కమిటీ వర్సెస్ కార్య నిర్వాహక కమిటీ మధ్య కలహాలు తారాస్థాయికి చేరాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఒక వీడియో విడుదల చేశారు. ఈవో అవగాహన లేమి, మొండిపట్టు కారణంగానే అంకురార్పణ ఆలస్యమైందని వెల్లడించారు.వైదిక వ్యవహారాల్లో సర్వాధికారాలు ఆలయ ప్రధాన అర్చకులకే ఉంటాయని స్పష్టం చేశారు. కల్యాణ బ్రహ్మ విషయంలో ఈవో రమాదేవి నిర్ణయం కారణంగానే అంకురార్పణ ఆలస్యమైందని వైదిక కమిటీ తేల్చి చెప్పింది.
ఆలయ ఈవోగా ఎవరూ వ్యవహరించినా ఏకఛత్రాధిపత్యం కుదరదని అర్చకులు చురకలంటించారు. ఈవో మార్పును తాము కోరడం లేదని సమన్వయం సయోధ్యతోనే స్వామి వారి కైంకర్యాలను ముందుకుతీసుకుపోవాలని కోరుతున్నట్లు వెల్లడించారు. వివాదం రేపిన అంకురార్పణ ఆలస్యంపై క్లారిటీ ఇవ్వడానికే వీడియో విడుదల చేసినట్లు వైదిక కమిటీ తెలిపింది. కార్యనిర్వాహక వ్యవహారాల్లో తాముతలదూర్చమని, వైదిక వ్యవహారాల్లోనూ ఆలయ ఈవో తలదూర్చకుండా ఉంటే సమస్యలు ఉత్పన్నం కావని ఆలయ పండితులు స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్ సంచలనం!
కాగా శ్రీసీతారాముల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల వేళ వైదిక కమిటీ కార్యనిర్వాహక విభాగాల మధ్య అంతరాలు, వివాదాలు ముదురుతుండటంతో రామభక్తుల అసహనం వ్యక్తం చేస్తు్న్నారు. ఇరువురి మధ్య భేధాభిప్రాయాల కారణంగా ఆలయప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా దేవాదాయ శాఖ మౌనం వహిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కమిషనర్ కలుగజేసుకుని తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సాఫీగా సాగేలా దేవస్థాన సమన్వయ అధికారిని నియమించాలని భక్తులు కోరుతున్నారు.
ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?