Jeevan Reddy: సీఎం రేవంత్‌పై తిరగబడ్డ జీవన్ రెడ్డి!

TG: MLC జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాను మానసిక ఆవేదనలో ఉన్నానని అన్నారు. ఫిరాయింపులకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు.

New Update
TG Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా!

MLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాను మానసిక ఆవేదనలో ఉన్నానని అన్నారు. ఫిరాయింపులకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువలు పాటించాలని అన్నారు. ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని.. గతంలో ఈ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ పోరాటం చేశారని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: సంచలన విషయాలు బయటపెట్టిన వైసీపీ

10ఏళ్లుగా పోరాడుతున్న....

ఈరోజు మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. గత పదేళ్లుగా కష్టంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. ఇతర పార్టీల నుంచి పదవుల ఆఫర్లు వచ్చిన తాను ఎన్నడూ కాంగ్రెస్ ను వీడలేదని చెప్పారు. పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీతో తాను పోరాటం చేశానని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఖాళీ కావడానికి ప్రధాన కారణమైన పోచారం శ్రీనివాస్ ను తిరిగి పార్టీలో చేర్చుకోవడం చాలా బాధ కలిగించిందని చెప్పారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన పోచారం శ్రీనివాస్ ను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా.. కీలక పదవులు కట్టబెట్టం మహా దారుణం అని అన్నారు. పార్టీలో కష్టపడ్డా వారికి పదవులు ఇవ్వాలని తప్ప ఫిరాయింపులు చేసిన నేతలకు కాదని అన్నారు.

Also Read :  మా వాడు క్వీన్ ఎలిజబెత్-2 రేంజ్‌! మేడమ్ టుస్సాడ్స్ లో ఆ ప్రత్యేక గౌరవం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంపించాడు...

తన ప్రధాన అనుచరుడిని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చంపించారని జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ పై పోరాడిన తనకు మంచి బహుమతి లభించిందని అన్నారు. తనతో చర్చించకుండా.. తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడం చాలా బాధేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులకు ఏమని చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా వేరే పార్టీ నుంచి గెలిచి తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారని అన్నారు. వారి నమ్మకాన్ని ప్రభుత్వం, పార్టీ కాపాడుకోవాలని సూచించారు. అధిష్టానం తీసుకునే నిర్ణయంపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

Also Read :  పైనాపిల్ తింటే అంతే సంగతి!

Also Read :  షర్మిల సంచలన నిర్ణయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు