Telangana congress : రాహుల్‌ గాంధీతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ..ఢిల్లీలో ఏం జరుగుతోంది?

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ  ముహూర్తం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై గట్టిగా ఫోకస్ పెట్టింది.

New Update
raj gopal reddy

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ  ముహూర్తం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై గట్టిగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నేతలు, మంత్రులు హస్తినకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో ఆయన మంత్రి పదవి విషయమై రాహుల్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

రెండు మంత్రి పదవులు ఖాళీ

ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ సీట్లను దక్కించుకోవడానికి సీనియర్ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి లాంటి నేతలు ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి వచ్చారు. ఎస్సీ కోటాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి పదవి కోసం రేసులో ఉండగా.. రంగారెడ్డి జిల్లా కోటా కింద తమకు అవకాశం ఇవ్వాలని మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి హైకమాండ్ ముందు గట్టిగానే ప్రతిపాదనలు పెడుతున్నారు.

మరోవైపు, కేవలం కొత్తవారిని చేర్చుకోవడమే కాకుండా ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రుల పోర్ట్‌ఫోలియోలను కూడా మార్చే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల కర్ణాటకకు సంబంధించిన రాజకీయ పంచాయితీ ఒక కొలిక్కి రావడంతో, కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడు పూర్తిస్థాయిలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై దృష్టి పెట్టింది. ఎవరికి ఏ మంత్రి పదవి దక్కబోతోంది? ఎవరి శాఖలు మారబోతున్నాయి? అనే ఉత్కంఠ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.

Advertisment
తాజా కథనాలు