/rtv/media/media_files/2026/04/12/mangli-2026-04-12-17-23-05.jpg)
Mangli case
Mangli case : మైక్రో ఫైనాన్స్ పేరిట సింగర్ మంగ్లీ పలువురిని మోసం చేసి వందల కోట్లు వసూలు చేసిందని ఇటీవల ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఆమెతో పాటు ఆమె సోదరుడు కలిసి పలువురి వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు బాధితులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ న్యాయవాది సుభా సింగబోష్ (సుబ్బారావు) పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నకిలీ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆమె కేసు పెట్టారు. తనను కలవాలని ఒత్తిడి చేశారని, నిరాకరిస్తే అప్రతిష్ఠపాలు చేస్తానని బెదిరించారని ఆరోపించారు. తన ఫ్యామిలీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు మంగ్లీ.
అయితే మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరికొంతమందిపై పంజాగుట్ట పోలీసుస్టేషన్ లో కేసు నమోదు కావడంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ తాజాగా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. తనపై ఆరోపణలు చేసిన న్యాయవాదిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ సందర్భంగా రూ.10 కోట్లకు మోసం చేశానంటూ తనపై సుబ్బరావు అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ తన ఫిర్యాదులో వివరించారు. సుబ్బారావే తన కార్యాలయం వద్దకు వచ్చి 10 లక్షలు డిమాండ్ చేశాడని, నిరాకరిస్తే అప్రతిష్ఠ పాలు చేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. అంతేకాక తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్ల వీడియో చూపించి బెదిరించాడని, మరో వ్యక్తితో కలిసి అవమానకరంగా మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. అంతేకాక సుబ్బారావు తీరుతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను మంగ్లీ కోరింది.
Follow Us