/rtv/media/media_files/2025/03/09/QPVg5rJtHtoKkp18NmLR.jpg)
Telangana Pradesh Congress Committee
CM Revanth Reddy : రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. తెలంగాణ శాసనమండలిలో మొత్తం 5 ఎమ్మెల్సీల కాల పరిమితి ముగిసింది. వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవలసి ఉంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి నాలుగు, ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ కు ఒక స్థానం దక్కనుంది. ఇక కాంగ్రెస్ కు దక్కే నాలుగింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక మిగిలిన మూడుస్థానాలకు అభ్యర్థుల ఎంపిక కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.
ఇది కూడా చూడండి: Trolls on Jr NTR: ఎన్టీఆర్ యాడ్ పై గోరంగా ట్రోలింగ్..! వీడియో చూశారా?
ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ఢిల్లీ నుంచి రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకొంటున్నారు. రేపటితో ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరనున్నారు. నేడు కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరగనుంది. కాగా4 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాలకు ఒక్కొక్క ఎమ్మెల్సీలు కేటాయించనుంది. అదే సమయంలో నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని సీపీఐ ఆశిస్తున్నది. మహిళ కోటలో ఎమ్మెల్సీ స్థానం కోసం విజయశాంతి, సునీత రావు ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ ఆశావాహులు జాబితాలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరకర వేణుగోపాల్, జీవన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, బండి సుధాకర్ గౌడ్, చరణ్ కౌశిక్ యాదవ్ తదితరలున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!
రాష్ట్ర కాంగ్రెస్ ఏఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఎఐసిసి జనరల్ సెక్రటరీ కేసు వేణుగోపాల్ ఆ తర్వాత, అంతిమంగా అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు కేసీ వేణుగోపాల్ పంపనున్నారు. అనంతరం ఏఐసీసీ అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడి తిరిగి వారంతా హైదరాబాద్ చేరుకుంటారు. అదే విధంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు ఏఐసీసీ పెద్దలతో భేటీ తర్వాతా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.అదే విధంగా కేబినెట్ విస్తరణతో పాటు పార్టీలో కీలక పదవులపై నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!