CM Revanth: అపోహలొద్దు.. అన్యాయం జరగదు: వారికి సీఎం రేవంత్ భరోసా!

వికారాబాద్ దామగుండం ఫారెస్టులో ప్రారంభించబోయే 'వీఎల్ఎఫ్' రాడార్ స్టేషన్ ప్రాజెక్టుపై అపోహలొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు మరింత గౌరవం తీసుకొస్తుందన్నారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. 

author-image
By srinivas
New Update
CM Revanth 2

CM Revanth Reddy: వికారాబాద్ దామగుండం అడవిలో (Damagundam forest) ప్రారంభించబోయే 'వీఎల్ఎఫ్' రాడార్ స్టేషన్ (VLF Radar Station) ప్రాజెక్టు తెలంగాణకు మరింత గౌరవాన్ని తీసుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్, ఎన్.ఎఫ్.సీ లాంటి కేంద్రాలకు గుర్తింపుపొందిన  హైదరాబాద్ ఈ కొత్త ప్రాజెక్టుతో దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందని చెప్పారు. మంగళవారం వికారాబాద్ పూడూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కొందరు కావాలనే 'వీఎల్ఎఫ్'ను వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారని, అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి:  బీరు సీసాల్లో ఐఈడీ బాంబ్‌.. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టుల బిగ్ స్కెచ్

తెలంగాణ సమాజం గుర్తించాలి..

దేశంలో రెండో వీఎల్ఎఫ్ మన ప్రాంతంలో రావడం గర్వకారణం. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దేశం ఉంటేనే మనం ఉంటాం. మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసేవారికి కనువిప్పు కలగాలి. 2 017లోనే భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి పూర్తి నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. ప్రాజెక్టును ప్రారంభించాలని రాజ్ నాథ్ సింగ్ అడగగానే మేం కొనసాగించాం. దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించాం. పర్యావరణ ప్రేమికులకు నేను ఒకటే చెబుతున్నా.. దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలమని రేవంత్ రెడ్డి అన్నారు. 

ఇది కూడా చదవండి: Revanth Reddy: అక్కా.. కొంచెం తగ్గు: కొండా సురేఖకు రేవంత్ క్లాస్!

వివాదాస్పదం చేయడం సమంజసం కాదు..

అలాగే దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ ను వివాదాస్పదం చేయడం సమంజసం కాదన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు.. దేశ రక్షణ విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్లాలి. వీఎల్ఎఫ్ ను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుంది. ఇక్కడ ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆలయానికి ఇబ్బందులు కలిగించొద్దని కోరుతున్నా. ప్రజల సెంటిమెంట్, విశ్వాసాన్ని గౌరవించి ఆలయానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరుతున్నా. ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో ఈ ప్రాంత ప్రజలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలని కోరుతున్నామన్నారు సీఎం.

ఇది కూడా చదవండి: iPhone: ఐఫోన్ 13, 14, 15లపై ఆఫర్ల జాతర.. ఇప్పుడు మిస్ అవ్వొద్దు!

మన దేశానికి అత్యంత ఉపయోగకరం..

ఇక ఈ ప్రాజెక్టుపై ప్రధాన్యత గురించి మాట్లాడిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఈ ప్రాజెక్ట్ మన దేశానికి అత్యంత ఉపయోగకరమైనదన్నారు. నేడు అబ్దుల్ కలాం జయంతి ఈ రోజు శంకుస్థాపన పనులు ప్రారంభించదం హర్షణీయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌కి కృతజ్ఞతలు దేశం భద్రత రక్షణ విషయంలో రాజకీయాలు చేయడం లేదు. దేశం బలమైన, భద్రత కోసం ఈ రకమైన స్టేషన్లు మన దేశానికి అత్యంత ముఖ్యమైనవి. పూర్వం కమ్యూనికేషన్, సమాచారం కోసం ఈగల్, ఇతర పక్షులను ఉపయోగించాం. ఇప్పుడు ఇతర కమ్యూనికేషన్‌లను వ్యవస్థను బలోపేతం చేస్తు ఉపయోగిస్తున్నాం. కమ్యూనికేషన్ వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. గత ముప్పై సంవత్సరాల నుండి మన దేశం కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దేశం బలమైన మిలిటరీని నిర్మించడానికి కట్టుబడి ఉంది. కొందరు వ్యక్తులు ఈ ప్రాజెక్ట్ గురించి తప్పుడు సమాచారాన్ని సృష్టిస్తున్నారు. పర్యావరణానికి నష్టం జరిగిందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పర్యావరణానికి హాని కలిగించదని మేము చెబుతున్నా.. కొంతమందికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. దేశ రక్షణ భద్రత విషయంలో కేంద్రం మరింత కట్టుబడి పనిచేస్తుందని రాజ్ నాథ్ చెప్పారు. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

Advertisment
Advertisment
తాజా కథనాలు