TS: మాగనూర్‌‌లో వికటించిన మధ్యాహ్న భోజనం..సీఎం రేవంత్ ఆగ్రహం

నారాయణపేట జిల్లాలోని మాగనూరు హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్ధులు అస్వస్థతకు గురైయ్యారు. దీనిపై  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 

author-image
By Manogna alamuru
New Update
Revanth 5

CM Revanth Reddy: 

ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. నారాయణపేట్‌ జిల్లా మగనూర్ జిల్లా పరిషత్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది అస్వస్థకు గురవ్వడం కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని అస్వస్థకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు.. విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో కొందరికీ ప్రాథమిక చికిత్స అందించి వాళ్లకు ఇళ్లకు పంపించారు. మరో 9 మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వీళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మరికొందరికీ పాఠశాల వద్దే చికిత్స అందిస్తున్నారు.

maganur

ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఫుడ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను రేవంత్ ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలపై వెంటనే విచారణ జరిపి, తనకు నివేదికను అందజేయాలని సీఎంవో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ ఇవ్వని మేజర్ సంస్థలు..కారణం ఏమై ఉంటుంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు