స్పోర్ట్ వర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబరు నెలాఖరులోగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును త్వరగా రూపొందించాలని ఆదేశించారు. By B Aravind 25 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి (స్పోర్ట్స్ పాలసీ) సంబంధించిన తుది ముసాయిదా (ఫైనల్ డ్రాఫ్ట్)ను నవంబరు నెలాఖరులోగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మనం రూపొందించే పాలసీ దేశంలోనే అత్యుత్తమ పాలసీగా ఉండాలని, అందుకు విస్తృత అధ్యయనం చేయాలని.. నిపుణులు, క్రీడాకారులతో విస్తృత స్థాయిలో సంపద్రింపులు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న క్రీడా వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, ఇప్పటికే ఉన్న స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని ఆదేశించారు. Also Read: రూ.10 నాణేలు చెల్లుతాయి.. లావాదేవీలకు వాడొచ్చు తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో భాగమైన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU), యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ (YISA), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు (SATG) సంబంధించి పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. అందులో చేపట్టాల్సిన మార్పులను సూచించారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలన్నారు. దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా అక్కడి కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించిన సందర్భంగా అక్కడ గుర్తించిన అంశాలను సీఎం రేవంత్ వివరించారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి దక్షిణ కొరియా క్రీడా వర్సిటీ ప్రతినిధులతో చర్చించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ అధికారులకు సూచించారు. Also Read: నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్.. విదేశాల్లో భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం దక్షిణ కొరియా క్రీడా వర్సిటీతో పాటు క్రీడా రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ అనసరిస్తున్న విధానాలపై కూడా అధ్యయనం చేయాలని సీఎం అన్నారు. మరో పది రోజుల్లోనే స్పోర్ట్స్ పాలసీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు సంబంధించిన క్యాలెండర్‌ను వెంటనే రూపొందించాలన్నారు. వచ్చే రెండేళ్లలో నేషనల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను సంప్రదించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్రప్రభుత్వ సలహాదారు కేశవరావు, తదితరులు పాల్గొన్నారు. #telangana #CM Revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి