గురుకుల హాస్టళ్లను సందర్శించనున్న సీఎం రేవంత్, భట్టి విక్రమార్క

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో సహా పలువురు మంత్రులు వ్యక్తిగతంగా గురుకుల హాస్టళ్లను శనివారం సందర్శించనున్నారు. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకోనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Batti and revanth

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో సహా పలువురు మంత్రులు శనివారం వాటిని సందర్శించనున్నారు. గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లకు వెళ్లనున్నారు. అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్.. రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలోని ఏదో ఒక సంక్షేమ హాస్టల్‌ను సందర్శించనున్నారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఖమ్మం జిల్లాలోని మధిర పాఠశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్

ఇదిలాఉండగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో రూ.667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించనుంది. హాస్టళ్ల పనితీరును నిరంతరం పర్యేవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన ఇప్పటికే స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటైన సంగతి తెలిసిందే. 

ఇది కూడా చూడండి: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!

 రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించడంతోపాటు మెరుగైన విద్య బోధనా అవకాశాలను పెంపొందించడానికి సర్కార్‌ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదిలాఉండగా ఇటీవల గురుకుల హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనలు వరుసగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ హాస్టళ్ల పరిస్థితిని తెలుసుకునేందుకు రానున్నట్లు తెలుస్తోంది .  

ఇది కూడా చూడండి: భార్యల వేధింపులకు భర్తలు బలి.. ఎన్ని ఘోరాలు జరిగాయంటే?

ఇది కూడా చూడండి: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు