Rape : కదులుతున్న బస్సులో మహిళ పై అత్యాచారం..నిందితుడి అరెస్ట్‌!

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ట్రావెలర్‌ బస్సులో ఓ మహిళ పై క్లీనర్‌ అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.నిందితుడు సాయి కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

author-image
By Bhavana
New Update
rape

Hyderabad : హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ట్రావెలర్‌ బస్సులో ఓ మహిళ పై క్లీనర్‌ అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళ పై నిందితుడు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు కూకట్‌ పల్లి పోలీసులు వివరించారు. నిందితుడు సాయి కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

నగరంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. జులై 3న కదులుతున్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం చేసినందుకు కండక్టర్‌ ని  అరెస్టు చేశారు. నిందితుడు కృష్ణను నాచారం సమీపంలో పట్టుకున్నారు. ఆ సమయంలో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్న బస్సులో కృష్ణ బాధితురాలితో సంభాషణలు జరిపి అత్యాచారం చేశాడు.

తాజా సంఘటనలో, కూకట్‌పల్లి నుండి తన స్వస్థలమైన ఏపీలోని సామర్లకోటకు వెళ్లేందుకు సాయి కుమార్ బస్సు (AP07 TT 6633) ఎక్కుతుండగా బాధితురాలు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి ఆమెతో మాటలు కలిపాడు. ఆ తర్వాత బస్సులో రద్దీ ఎక్కువగా ఉంటుందని బాధితురాలిని మరో సీటులోకి మారమని చెప్పాడు. వాటర్ బాటిల్ ఇచ్చి ఆమెతో మాట్లాడసాగాడు. అనంతరం ఆమె  మూతి బిగించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని సాయి కుమార్ బాధితురాలిని బెదిరించి, రెండోసారి దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అనంతరం బస్సు స్టాప్‌లో ఆగిన బాధితురాలు బస్సు దిగి ట్రావెల్‌ కంపెనీ యజమాని అనిల్‌రెడ్డికి ఫోన్‌  చేసి విషయాన్ని తెలియజేసింది. 

అనిల్ రెడ్డి బాధితురాలితో కలిసి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును కూకట్‌పల్లి పోలీసులకు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం కూకట్‌పల్లి పోలీసులు మహిళా పోలీసుల సమక్షంలో బాధితురాలి ఫిర్యాదును నమోదు చేసి కేసు నమోదు చేసి (1215 ఆఫ్ 2024) సాయికుమార్‌ను అరెస్టు చేశారు.

Also Read :  తిరుమల ప్రసాదం గురించి ..సుప్రీం కోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment