MLa Padi Kaushik Reddy : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఫాక్...ఆ కేసులో సీఐడీ నోటీసులు

హుజురాబాద్‌ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్‌ తగిలింది. కౌశిక్‌ రెడ్డితో పాటు మరో 20 మందికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌ 4న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

New Update
koushik

padi koushik reddy

 MLa Padi Kaushik Reddy : హుజురాబాద్‌ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్‌ తగిలింది. కౌశిక్‌ రెడ్డితో పాటు మరో 20 మందికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌ 4న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది ఈ మేరకు కౌశిక్‌  రెడ్డితో పాటు ఇరువైమంది కి ఈ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. వారందరికీ ఈ మేరకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.కౌశిక్ రెడ్డితో పాటు మరో 20 మందికి సీఐడీ అధికారులు నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..

జనవరి 29న సమ్మక్క - సారలమ్మ జాతర జరిగింది. ఈ క్రమంలో హుజురాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంకలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లిన కౌశిక్‌రెడ్డిని మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.  దీంతో కౌశిక్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. హుజురాబాద్‌లో నమోదైన ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. కాగా ఈ  కేసుపై సీఐడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. అందులో భాగంగానే కౌశిక్ రెడ్డికి సీఐడీ  నోటీసులు ఇచ్చింది... ఏప్రిల్ 4న హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లో ఉన్న  సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆయనకు సూచించింది.

సమ్మక్క-సాలరమ్మ జాతర సందర్భంగా మరో వర్గానికి, పాడి కౌశిక్‌ రెడ్డి వర్గానికి మధ్య నెలకొన్న విభేధాల మూలంగా పోలీసులు ఆయనను జాతరకు రాకుండా అడ్డుకున్నారు. ఆయన అక్కడికి వస్తే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక్‌ రెడ్డితో పాటు ఆయన అనుచరులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డితో పాటు అనుచరులను హుజురాబాద్ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు నోటీసులు ఇచ్చారు.  సుమారు 20 మందికి ఈ నోటీసులు అందజేశారు. కాగా సీఐడీ నోటీసులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తనను వేధిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే సీఐడీ నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Advertisment
తాజా కథనాలు