GOODNEWS: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండో విడత రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతు పక్షపాతి అని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు.

New Update
_Chief Minister Revanth Reddy

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండో విడత రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతు పక్షపాతి అని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం రైతుల కష్టాలను తీర్చిందని గుర్తు చేస్తూ, అదే స్ఫూర్తితో ప్రస్తుత ప్రభుత్వం రైతుల పెట్టుబడి సాయం కోసం నిధులు కేటాయిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు