Chicken Mela : కోయి..కోయి. కోడ్ని కోయి..తెలంగాణ వ్యాప్తంగా చికెన్‌ మేళాలు

గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ భయంతో జనాలు చికెన్ కొనడం, తినడం తగ్గించేశారు. దీంతో చికెన్‌సెంటర్లు బోసి పోతున్నాయి. మరోవైపు పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మిగిలిపోతున్నాయి. దీంతో ప్రజల్లో అవగాహనకోసం రాష్ట్ర వ్యాప్తంగా యజమానులు చికెన్‌ మేళాలు నిర్వహిస్తున్నారు.

New Update
 Chicken Mela

Chicken Mela

Chicken Mela : గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ భయంతో జనాలు చికెన్ కొనడం, తినడం తగ్గించేశారు. దీంతో చికెన్‌ సెంటర్లు బోసి పోతున్నాయి. మరోవైపు పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు అలాగే మిగిలిపోతున్నాయి. దీంతో ఆర్థికంగా నష్ట పోతున్నారు. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చికెన్‌ సెంటర్ల యజమానులు, పౌల్ర్టీపారాల నిర్హహకులు చికెన్‌ మేళాలు నిర్వహిస్తు్న్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చికెన్ మేళాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే.. బండ్లగూడలో ఫ్రీ చికెన్ అండ్ ఫ్రీ ఎగ్స్ మేళా నిర్వహించారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో మచాన్ పల్లి సొసైటీ పక్కన ఉన్న "వెన్ కాబ్ అండ్ రెడ్డి చికెన్" సెంటర్ ఆధ్వర్యంలో ఫ్రీ చికెన్ మేళా నిర్వహించారు.  

Also Read: Champions Trophy: శుభ్ మన్ గిల్ ను వెళ్ళు వెళ్ళు అన్న అబ్రార్

ఈ సందర్భంగా ఎప్పటి లాగానే చికెన్ కొనుక్కొని హాయిగా అందరూ తినాలని నిర్వాహకులు కోరారు. దయచేసి వదంతులు నమ్మడం మాని అందరూ చికెన్ తినాలని ఈ ఫ్రీ చికెన్ మేళా నిర్వాహకులు కోరారు. ముందుగా షాప్ నిర్వాహకులు తిన్న తర్వాతనే పబ్లిక్కి వండిన చికెన్ను, కోడిగుడ్లను పంచారు. రెండు క్వింటాల చికెన్, రెండు వేల కోడిగుడ్లతో పాటు వాటర్ కూడా ఫ్రీగా పంపిణీ చేశారు. గంట లోపే జనాలు తినేశారు.

Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు

 మెదక్ పట్టణంలోని ఆటోనగర్లో ఓ చికెన్  సెంటర్ నిర్వాహకుడు చికెన్, ఎగ్​మేళా నిర్వహించాడు. ఇందులో భాగంగా చికెన్, కోడిగుడ్డుతో వివిధ రకాల వంటకాలు తయారు చేసి ఫ్రీగా పంపిణీ చేశాడు. విషయం తెలుసుకున్న ప్రజలు వాటిని తినేందుకు ఎగబడ్డారు. చికెన్, గుడ్డు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదనే విషయం ప్రజలకు తెలియజేసేందుకే ఈ మేళా ఏర్పాటు చేసినట్లు చికెన్ సెంటర్ నిర్వాహకుడు చెప్పాడు. నల్గొండలో నిర్వహించిన చికెన్ మేళా కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. 300 కేజీల చికెన్ 65, 2 వేల ఎగ్స్‌‌ గంటలోనే తినేశారు.

Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్‌... 140 సోషల్‌ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!

చౌటుప్పల్ పౌల్ట్రీ ట్రేడర్స్, వెంకాబ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చౌటుప్పల్ లోని వలిగొండ చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి చికెన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా చికెన్ లెగ్ పీసులు, గుడ్లను ఉడికించి స్థానికులకు ఉచితంగా అందజేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. చికెన్ లెగ్ పీసులు ఉడికించిన గుడ్లను ఉచితంగా అందజేస్తున్నారని తెలుసుకున్న చికెన్ ప్రియులు వాటిని ఆరగించడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఇది కూడా చూడండి: Allu Arjun: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!

ఈ సందర్భంగా సుమారు 500 చికెన్ లెగ్ పీసులు, 3000 గుడ్లను ఉడికించి అందజేశారు. దీంతో జనం ఎగబడి ఎగబడి తిన్నారు. ఈ సందర్భంగా పలువురు పౌల్ట్రీ వ్యాపారులు మాట్లాడుతూ.. బర్డ్ ఫ్లూ కేవలం పక్షులకు, కోళ్లకు మాత్రమే వస్తుందని మనుషులకు రాదని తెలిపారు. 70 డిగ్రీలు దాటిన సెంటిగ్రేడ్ హీట్ లో చికెన్ ను ఉడికించి తింటే ఎలాంటి వ్యాధులు మనుషులకు సోకవని తెలిపారు. చికెన్ ప్రియులు ఎలాంటి భయం, ఆందోళన చెందకుండా చికెన్ ను తినవచ్చని పేర్కొన్నారు .

 

  
  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు