తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్‌లో అవినీతి జరిగిందని అశోక్ సార్ ఆరోపించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో దొంగలు పడ్డారని షాకింగ్ విషయాలు ఆయన వెల్లడించారు. 563లో సగానిపైగా ఉద్యోగాలు అమ్ముకున్నారని చెబుతున్నారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ ఎగ్జామ్ జనరల్ ర్యాకింగ్ ఫలితాలు మార్చి 30న విడుదల చేశారు. అయితే అందులో టాప్ 100 ర్యాంకుల్లో 44 శాతం ఓసీలే ఉన్నారని అశోక్ సార్ వివరించారు. గ్రూప్ 1లో దొంగల ర్యాజం నడుస్తోందని అన్నారు. డబ్బు ఉన్నోలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని అశోక్ సార్ ఆరోపిస్తున్నారు. అసలు దొంగలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ మాజీ ఛైర్మన్ మహేందర్ రెడ్లే అని ఆయన అన్నారు. EWS రిజర్వేషన్ పేరిట అన్ని ఉద్యోగాలు రెడ్లకే దోచిపెట్టారని అశోక్ సార్ అంటున్నారు.
Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
కోటి ఉమెన్స్ కాలేజీ సెంటర్ నుంచే 74 మంది గ్రూప్ 1 ఉద్యోగాలకు సెలక్ట్ అయ్యారని అశోక్ సార్ చెప్పారు. 520 పైగా మార్కులు వచ్చిన ఆరుగురిలో నలుగురు ఓసీలే ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేవలం 20 సెంటర్ల నుంచే 90శాతం మంది అభ్యర్థులు సెలక్ట్ అయ్యారు. ఈ నోటిఫికేషన్‌లో ఫలితాల్లో టాప్ మొదట వచ్చిన 100 మందిలో 3 శాతం ఎస్సీలు, 5శాతం ఎస్టీలు మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చారు. వాళ్లకున్న రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అశోక్ సార్. కొడంగల్ అభ్యర్థి 28 రోజులు మాత్రమే చదివి టాప్ మార్కులు సాధించాడని.. అతనికి అన్ని మార్కులు ఎలా వచ్చాయని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను నిలదీశారు. గ్రూప్ 1 ఫలితాల అవకతవకలపై ఉద్యమిస్తామని అన్నారు. నిరాహార దీక్షకు దిగాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో పేపర్ లీకులు జరిగాయని కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్1 ఉద్యోగాలు అమ్ముకుందని అశోక్ సార్ అంటున్నారు. 563 ఉద్యోగాల ఫలితాలపై ఎక్వైరీ కమిషన్ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి