/rtv/media/media_files/2025/02/28/1Ohu1qYpVptJp6UANqs1.jpg)
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూ్స్ చెప్పింది. వరంగల్లో మామునూరు ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
బ్రేకింగ్... మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...
— RTV (@RTVnewsnetwork) February 28, 2025
ఉత్తర్వులు జారీచేసిన కేంద్రం...
ఇప్పటికే మామునూరు ఎయిర్పోర్టు భూసేకరణ కు 205 కోట్ల రూపాయలను విడుదల చేసిన రాష్ట్ర సర్కార్...
ఎయిర్ పోర్టు పరిధిలో ఇప్పటికే 696 ఎకరాలు... మరో 253 ఎకరాల భూమి సేకరిస్తున్న రాష్ట్ర… pic.twitter.com/4VltLDChG8
రూ. 205 కోట్లు విడుదల
ఇప్పటికే మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణకు రాష్ట్రం ప్రభుత్వం రూ. 205 కోట్లు విడుదల చేసింది. ఎయిర్ పోర్టు కోసం రూ. 696 ఎకరాల భూసేకరణ పూర్తి కాగా.. మరో 253 ఎకరాలు సేకరించాల్సి ఉంది.ఈ భూమిలో కొంత రన్‌వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నేవిగేషన్ ఇన్‌స్ట్రుమెంట్ ఇన్‌స్టలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ విమానాశ్రయం నిర్మాణం త్వరగా పూర్తయితే తెలంగాణలో మరొక ఎయిర్‌పోర్ట్ ఏర్పడి, ప్రజలకు మరింత ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
ఎయిర్ పోర్టు నిర్మాణం మరింత వేగంగా
గత పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న NOC అడ్డంకిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జీఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, బోర్డులో పెట్టి NOC ఇచ్చేలా చేశారు. దీంతో HAIL తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ NOC ఇచ్చారు. ఇప్పుడు ఈ NOC ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిందని మంత్రి తెలిపారు. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ ద్వారా తెలిపినట్లు మంత్రి వివరించారు. దీంతో మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.