BIG BREAKING: కవిత ఇంటికి సీబీఐ అధికారులు!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి నేడు సీబీఐ అధికారులు వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇటీవల హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన నోటీసులు ఇచ్చేందుకు కవిత ఇంటికి అధికారులు వచ్చారు.

New Update
kavitha

హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి నేడు సీబీఐ అధికారులు వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన నోటీసులు ఇచ్చేందుకు కవిత ఇంటికి అధికారులు వచ్చారు. ఇటీవల ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులపై ఉన్న అభియోగాలను డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. రౌస్ అవెన్యూ కోర్టు తాము చూపిన ఆధారాలను పట్టించుకోలేదని పిటిషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కవితతో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇంటికి కూడా నేడు సీబీఐ అధికారులు వెళ్లారు. శ్రీనివాసుల రెడ్డి కుమారుడికి సైతం సీబీఐ నోటీసులు అందించింది. సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో కవిత ఇంట్లో లేకపోవడంతో ఆమె భర్త అనిల్ నోటీసులు తీసుకున్నారు. అయితే.. ఈ నెల 16న కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.



రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చ నియాంశమైంది. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని మరోసారి తేలిందని కవిత, కేజ్రీవాల్ అన్నారు. తీర్పు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ కంటతడి పెట్టారు. తాను అవినీతి పరుడని కట్టు కథలు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిజాయితీ పరుడతి కోర్టు తీర్పుతో తేలిందన్నారు. ఢిల్లీలో ఇప్పుడు ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీకి పది కన్నా ఎక్కువ సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. 

Advertisment
తాజా కథనాలు