ఆమ్రపాలికి షాక్.. సేవ చేయాలని లేదా అంటూ చివాట్లు!

ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లకు క్యాట్ షాక్ ఇచ్చింది. డీవోపీటీ ఆదేశాలు పాటించాల్సిందేనంటూ తీర్పు వెల్లడించింది. రేపు యథావిధిగా ఎక్కడివాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు సేవ చేయాలని లేదా? అంటూ చివాట్లు పెట్టింది. 

New Update

TG News: ఐఏఎస్ ఆఫీసర్లకు క్యాట్ షాక్ ఇచ్చింది. డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వులు రద్దుచేయాలంటూ ఐదుగురు ఐఏఎస్‌లు వేసిన పిటిషన్ ను క్యాట్ తోసిపుచ్చింది. డీవోపీటీ ఆదేశాలు పాటించాల్సిందేనంటూ తీర్పు వెల్లడించింది. అంతేకాదు రేపు యథావిధిగా ఎక్కడివాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారికి సేవ చేయాలని లేదా? అంటూ చివాట్లు పెట్టింది. 

ఇది కూడా చదవండి: స్కిల్ యూనివర్సిటీ ప్రవేశాలకు దరఖాస్తులు.. లాస్ట్ డేట్ ఇదే!

అది గైడ్‌లైన్స్‌లో ఉందా..

అలాగే స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్‌ చేసుకోవచ్చని గైడ్‌లైన్స్‌లో ఉందా అంటూ ఐఏఎస్ లను ప్రశ్నించింది. ఐఏఎస్‌ల కేటాయింపుపై డీఓపీటీకి నిర్ణయం తీసుకునే అధికారం ఉందని స్పష్టం చేసింది. వన్‌ మెన్‌ కమిటీ సిఫారసులను డీఓపీటీ ఎలా అమలు చేస్తుందని,  వన్‌ మెన్‌ కమిటీ సిఫారసు చేసినప్పుడు ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదని క్యాట్‌ అడిగింది.

ఇది కూడా చదవండి: RGV డెన్ లో 'యానిమల్' డైరెక్టర్.. ఏం ప్లాన్ చేస్తున్నారో?

ప్రజాహితాన్నే పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్యాట్ తెలిపింది. ఇక క్యాట్ ను ఆశ్రయించిన వారిలో.. రోనాల్డ్ రాస్‌  -TG ఎనర్జీ శాఖ సెక్రటరీ, వాణి ప్రసాద్ -TG టూరిజం సెక్రటరీ, వాకాటి కరుణ -TG మహిళా శిశు శాఖ సెక్రటరీ, ఆమ్రపాలి -TG  GHMC కమిషనర్, సృజన - ఏపీ NTR జిల్లా కలెక్టర్ ఉన్నారు. 

ఇది కూడా చదవండి: CM Revanth: అపోహలొద్దు.. అన్యాయం జరగదు: వారికి సీఎం రేవంత్ భరోసా!

ఇది కూడా చదవండి: iPhone: ఐఫోన్ 13, 14, 15లపై ఆఫర్ల జాతర.. ఇప్పుడు మిస్ అవ్వొద్దు!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు