/rtv/media/media_files/2025/04/01/WlBbuDRA5OJLz6R7TTEa.jpg)
Byd Electric Cars
Revanth Reddy : రేవంత్ రెడ్డి సర్కారుకు చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ బీవైడీ (BYD) బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను బీవైడీ సంస్థ ఖండించింది. హైదరాబాద్‌లో ప్లాంట్ ఏర్పాటుపై ప్రస్తుతం ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.హైదరాబాద్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంకా ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రకటించింది.
ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
బీవైడీ సంస్థ ఇప్పటికే భారత్‌లో తన కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, ఇక్కడ సొంత ఉత్పత్తి యూనిట్ లేదు. ప్రస్తుతం చైనాలో ఉత్పత్తి చేసిన కార్లను దిగుమతి చేసుకోవడం వల్ల అధిక సుంకం చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో.. భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కంపెనీ కొంతకాలంగా యోచిస్తోంది. దీంతో హైదరాబాద్‌లో యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం బీవైడీతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే.. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్ సమీపంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వైరలయ్యాయి. కాగా.. ఈ కథనాలు సంస్థ దృష్టికి వెళ్లటంతో.. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కంపెనీ స్పష్టం చేసింది.
ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
ప్రపంచంలోనే నెంబర్ వన్ ఈవీ సంస్థ అయిన బీవైడీ.. హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైందని.. సుమారు రూ.70 వేల కోట్లతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. బీవైడీ కంపెనీ పెట్టుబడితో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని కూడా ప్రచారం జరిగింది. అంతేకాకుండా.. ఈ కంపెనీ హైదరాబాద్‌కు వస్తే.. దేశీయ ఈవీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని కూడా అందరూ ఆలోచించారు. కాగా.. ఈ వార్తలను బీవైడీ కంపెనీ పూర్తిగా ఖండించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
అయితే, ఈ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ ఫలితంగానే బీవైడీ లాంటి సంస్థలు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ఈ ప్లాంట్ రాష్ట్రానికి రావడంలో తమ బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర కీలకమని, దీని కోసం చాలా సంవత్సరాలు కృషి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే బీవైడీ తన నిర్ణయంపై స్పష్టత ఇవ్వనప్పటికీ.. భవిష్యత్తులో కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్