/rtv/media/media_files/2026/04/14/balakrishna-2026-04-14-16-48-17.jpg)
Fake CISF Officer
Fake CISF Officer : సీఐఎస్‌ఎఫ్‌అధికారినంటూ నమ్మించి యువతులను మోసం చేస్తున్న ఓ నకిలీ సీఐఎస్‌ఎఫ్ (CISF) అధికారిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మిలటరీ యూనిఫాం ధరించి ఎయిర్‌పోర్ట్‌లో హల్‌చల్ చేస్తున్న ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ అధికారి వేషధారణలో తిరుగుతున్న నిందితుడు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతను పొంతనలేని సమాధానాలు చెబుతుండగా అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అతను చెప్పిన వివరాలు విని భద్రతా సిబ్బంది మైండ్ బ్లాకయింది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి, తాను సీఐఎస్‌ఎఫ్ అధికారిగా పనిచేస్తున్నానని అందరినీ నమ్మిస్తున్నాడు. నమ్మించడమే కాకుండా పెళ్లి కాని యువతులను పెళ్లిపేరుతో మోసం చేస్తున్నట్లు తేలింది. అలా ఒకరు ఇద్దరూ కాదు ఏకంగా 67 మంది యువతులను బురిడీ కొట్టించినట్లు తేలింది. నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. సీఐఎస్‌ఎఫ్ జవాన్‌ను అని నమ్మించేందుకు ఖరీదైన యూనిఫాం, నకిలీ ఐడీ కార్డులను కూడా సిద్ధం చేసుకున్నట్లు తేలింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అదే యూనిఫాంలో హడావిడి చేస్తూ అధికారుల కంటపడటంతో సిబ్బంది విచారణలో అతను నకిలీ అధికారి అని తేలింది.
నిందితుడు బాలకృష్ణ మ్యాట్రిమొనీ డాట్‌కామ్‌లో పోలీస్ అధికారుల వేషంతో యువతులకు వల వేసినట్లు తేలింది. అనంతరం వారిని మాటల్లో పెట్టి పలు రకాల మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. అయితే, అతడు ఇప్పటికే 67 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. పలువురు అమాయక మహిళలను నమ్మించి వారి నుంచి భారీగా నగదు, నగలు వసూలు చేసి ఆ తర్వాత వారికి కనిపించకుండా పోవడం బాలకృష్ణ ప్రత్యేకతగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతని వద్ద ఉన్న యూనిఫాం, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతడి ఫోన్ డాటా ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.
Follow Us