BRS Working President KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర పర్యటన...ఎప్పటి నుంచంటే..

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టనున్నట్లు పార్టీ నేతలతో స్పష్టం చేశారు. ఈ రోజు పార్టీ శ్రేణులతో మాట్లాడిన కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు.  

New Update
KTR

BRS Working President KTR

BRS Working President KTR : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టనున్నట్లు పార్టీ నేతలతో స్పష్టం చేశారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు ముందు పార్టీ శ్రేణులతో మాట్లాడిన కేటీఆర్.. ఈ విషయాన్ని వెల్లడించారు.  అలాగే బీఆర్‌ఎస్‌ పార్టీ సిల్వర్ జూబ్లీ సంబరాల  విజయానికి పార్టీ నేతలకు ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే రాష్ట్రవ్యాప్తం గా అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు.

Also Read: గ్రూప్ 1 ఫలితాలపై అనుమానాలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు

ఈ పర్యటనలో భాగంగా.. ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.  ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వరంగల్‌లో లక్షలాదిమంది పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది.

Also Read: రన్యా రావుతో ఇద్దరు మంత్రులకు లింక్‌..బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్‌
 
పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు, సంబరాలను నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించబడింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వేటిని అమలు చేయకుండా వంచిస్తున్న తీరుపై కూడా చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు, జిల్లా నేతలకు, కార్యకర్తలకు కేటీఆర్ స్వయంగా మార్గదర్శనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, మార్చి 20న సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంతోపాటు, పదేండ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా మరోసారి గుర్తుచేసుకోనున్నారు.

Also Read: మండుతున్న ఎండల్లో ఓ చల్లని వార్త...ఈ నెల 21 నుంచి...

Also Read: సునీతా విలియమ్స్‌ జీతం ఎంతో తెలుసా ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి లభించింది. దీనికి సంబంధించి పర్మిషన్ పత్రాలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి తీసుకున్నారు. 

New Update
ts

BRS

ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది.

 

today-latest-news-in-telugu | brs-party | meeting | warangal 

 

Also Read: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ ఏం ఆడింది మామా..

Advertisment
Advertisment
Advertisment