/rtv/media/media_files/2025/02/28/WFeEtuqcc5brdzvTK3hV.jpg)
KTR on SLBC
తెలంగాణలో ప్రజా పాలన పరాకాష్టకు చేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. విషాదంలో మంత్రుల వినోదం అంటూ ఫైర్ అయ్యారు. హెలికాప్టర్ యాత్రలు .. చేపకూర విందుల్లో మంత్రులు మునిగిపోయారంటూ ట్వీట్ చేశారు. మరో వైపు హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్నం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్ ప్రజా ప్రభుత్వం ఉందన్నారు.
పరాకాష్టకు చేరిన ప్రజాపాలన
— KTR (@KTRBRS) February 28, 2025
విషాదంలో మంత్రుల వినోదం
హెలికాప్టర్ యాత్రలు .. చేపకూర విందులు
హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్నం పెట్టకుండా పస్తులు
విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్ ప్రజా ప్రభుత్వం
"అన్నం వండలేదు గుడిలో తినండి" అని విద్యార్థులకు ఆదేశాలు… pic.twitter.com/LKzrMasmKY
పస్తులుంచడమే ప్రజాపాలనా?
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్ సిబ్బంది "అన్నం వండలేదు గుడిలో తినండి" అని విద్యార్థులకు ఆదేశాలు ఇచ్చారని తన X పోస్టులో కేటీఆర్ పేర్కొన్నారు. కొండనాగులలోని ఎస్టీ బాలుర హాస్టల్లో శివరాత్రి పండుగ రోజు 380 మందికి గాను 200 మంది విద్యార్థులు ఉన్నారన్నారు.
అయితే మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి వెళ్ళి తినాలని, రాత్రి భోజనం కోసం వీరం రామాజిపల్లిలోని గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినమని విద్యార్థులకు చెప్పి వంట చేయలేదన్నారు. భోజనం కోసం అంత దూరం నడిచి వెళ్ళే ఓపిక లేక విద్యార్థులు పస్తులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా? అని ప్రశ్నించారు.
SLBC సొరంగం కూలడంతో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడడానికి రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పనులను పరిశీలించడానికి వెళ్లిన మంత్రులు చేపల కూర వంచించుకుని తిన్నారంటూ నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది. తాజాగా అదే ఫొటోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ షేర్ చేశారు.