Social Media: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ అరెస్ట్ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి కొణతం దిలీప్ ను అరెస్ట్ చేశారు. దిలీప్ అరెస్ట్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. By Nikhil 18 Nov 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ కోణతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దిలీప్ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. Also Read: Hyderabad Food: ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్...! గతంలో ప్రభుత్వం పెట్టిన కేసుల నిమిత్తం కోర్టు అదేశాలతో విచారణకు హాజరయ్యెందుకు సీసీఎస్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన దిలీప్ కొణతం సార్ను అరెస్టు చేసిన పోలీసులుIs this mohabbat ki dukaan @RahulGandhi..?pic.twitter.com/b5YC0gWlMi — Pavan Kumar (@Pavanbrs6) November 18, 2024 Also Read: పరువు పోతుందనే లగచర్లలో రేవంత్ కుట్ర..ఈటల సంచలన ఆరోపణలు! అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. లగచర్ల, మూసీ ప్రాజెక్ట్ అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేక ప్రచారం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. ఇలాంటి పోస్టులు పెడుతున్న, పెట్టిస్తున్న వారిపై చర్యలలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. Also Read: పోలీసులను చితకొట్టిన అఘోరి.. ఈడ్చుకెళ్లి DCMలో పడేసి ఏం చేశారంటే? అరెస్టును ఖండించిన హరీశ్ రావు.. కొణతం దిలీప్ అరెస్ట్ ను మంత్రి మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత, ప్రతీకార చర్యలను మానుకోవాలన్నారు. ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ.. అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత, ప్రతీకార చర్యలను మానుకోవాలి. ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ.. అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గం.ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటు.తెలంగాణ ఉద్యమకారుడు @KonathamDileep అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నాం.… — Harish Rao Thanneeru (@BRSHarish) November 18, 2024 Also Read: అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్ #arrest #brs #social-media #incharge మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి