BRS Silver Jubilee : ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా...గెలుపులు, ఓటములు...బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణం ధ్యేయంగా 25ఏళ్ల క్రితం ఏర్పాటైన టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్‌) ప్రస్థానంలో.. ఎన్నో అటుపోట్లు, తిరుగులేని విజయాలు ఉన్నాయి. టీఆర్ఎస్ గా పురుడుపోసుకుని బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినపార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టనుంది.

New Update
BRS-foundation-day

BRS-foundation-day

BRS Silver Jubilee : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణం ధ్యేయంగా 25ఏళ్ల క్రితం ఏర్పాటైన టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్‌) ప్రస్థానంలో.. ఎన్నో అటుపోట్లు, తిరుగులేని విజయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పురుడుపోసుకుని భారత రాష్ర్టసమితిగా రూపాంతరం చెందిన బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోకి అడుగు పెట్టనుంది. ఒక రాష్ట్ర చరిత్రలో 25 ఏండ్లు అంటే తక్కువేం కాదు. తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన పార్టీగా, ఉద్యమ పంథాలో కొనసాగి, రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పదేండ్లు అధికారంలో కూడా ఉండటం బీఆర్‌ఎస్‌ ప్రత్యేకత.

2001, ఏప్రిల్‌ 27న తెలంగాణ అస్తిత్వ పతాకగా పురుడుపోసుకున్న పార్టీ.. ఏప్రిల్‌ 27, 2025 నాటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి ప్రవేశించనున్నది. ఈ నేపథ్యంలో పార్టీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ 14 ఏండ్లు అవిరామంగా పోరాటం చేసి, అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన పార్టీగా బీఆర్‌ఎస్‌ కు రాష్ర్టంలో గుర్తింపు ఉంది.  

Also read :  మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!

తెలంగాణ రాష్ట్ర సమితి.. భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ. ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నిస్తూ స్వయంపాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చింది. అంతకుముందున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్లి గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు టీఆర్ఎస్ అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.

2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్.. గులాబీ జెండాను ఎగరవేశారు. నాటి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగింది టీఆర్ఎస్. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకొన్నాక.. కొన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ రాజకీయం పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. కేసీఆర్‌తోపాటు పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవులను లెక్కచేయక రాజీనామాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత 2010లో జరిగిన ఉపఎన్నికలు మొదలు క్రమంగా బలపడుతూ, బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. అదే ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర ప్రకటన..ఆ తర్వాత జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు కేసీఆర్.

Also Read :  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు

ఇక తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతానంటూ హస్తిన వెళ్లిన కేసీఆర్ స్వప్నం.. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందడంతో నెరవేరింది. 2014 జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఘనవిజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్.. కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నవతెలంగాణకు భవితకు బాటలు వేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు. 2014 మొదలు ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తూ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 99 స్థానాలను సాధించి రికార్డు సృష్టించింది. ఇదే సమయంలో తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన గులాబీ నాయకత్వం.. కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీల నాయకులను ఆకర్షించింది.

Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!


 పదవీకాలం మరో తొమ్మిది నెలలు ఉండగానే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్.. 2018 ఎన్నికల్లో తిరుగులేని విజయంతో సత్తా చాటింది. దీంతో కేసీఆర్ రెండోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ బాధ్యతలు చేపట్టడంతో గులాబీ పార్టీలో కొత్త వాతావరణం ఏర్పడింది. ఫెడరల్ ఫ్రంట్ పేరిట జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ మధ్యలో దృష్టి సారించారు.కానీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో అది సాధ్యం కాలేదు. అటు రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్​కు అంత అనుకూలంగా రాలేదు.  స్వపరిపాలనలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్.. పలు అంశాల్లో తనదైన ముద్ర వేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, రెండు పడకల గదుల ఇండ్లు, కులవృత్తులకు తోడ్పాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది.

Also Read: ఇదేం ఉద్యోగం తల్లి.. ‘వర్క్ ఫ్రమ్ కార్’.. పోలీసుల పనికి అంతా షాక్!

ఆయితే 2024 ఎన్నికల్లో ఘోరా పరాజయం పాలైన బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో మరింత డీలా పడింది. ఈ క్రమంలో పార్టీ అధినేత కేసీఆర్‌ ఫాంహైజ్‌ కే పరిమితమయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలలో పదిమంది పార్టీ మారటం. అధికారం కోల్పొయి పూర్తి నైరాశ్యంలో ఉన్న పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఈ సిల్వర్‌ జూబ్లీ వేడుకలను వినియోగించుకోవాలని నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా  పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ రజతోత్సవ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గం ఈ నెల 19న సమావేశం కావాలని.. అధినేత కేసీఆర్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 19న తెలంగాణభవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం జరగనుంది. కేసీఆర్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు.. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు పాల్గొననున్నారు.

Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!

‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా భారాస శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర చర్చ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన, హక్కులను కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై సమావేశంలో చర్చిస్తాం’’అని కేటీఆర్‌ తెలిపారు.

Also Read: ఢిల్లీ సీఎం ఎంపిక అప్పుడే.. ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HCU భూముల వ్యవహారం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వీడియోల విషయంలో తనపై కేసు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు బలం ఉందన్నారు. ఎంఐఎంను కంట్రోల్ చేస్తామన్నారు.

New Update
Kishan Reddy Vs Revanth

Kishan Reddy Vs Revanth

HCU భూముల విషయంతో తాను షేర్ చేసిన వీడియోలపై కేసు పెడతానంటే పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో పలు కీలక విషయాలు వెల్లడించారు. తాను కేసులకు భయపడనన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు బలం ఉందన్నారు. ఇతర పార్టీల ఓటర్లను కూడా కలిసి వారి మద్దతు కూడగడతామన్నారు. మజ్లిస్ పార్టీ మెల్లిగా పెరుగుతుందన్నారు. పాతబస్తీకి పరిమితమైన ఎంఐఎం కొత్త సిటీలో సీట్లు గెలుస్తోందన్నారు. ఎంఐఎంను కంట్రోల్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆ పార్టీతో ఎంఐఎం జతకట్టి బలోపేతం అవుతోందన్నారు. 

వక్ఫ్ పేరుతో వ్యాపారం..

వక్ఫ్ బోర్డు పేరుతో వ్యాపారం చేసే వారే వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాని మండిపడ్డారు కిషన్ రెడ్డి. నిరసనలో సామాన్య ముస్లింలు ఎవరూ పాల్గొనడం లేదన్నారు. తాము తెచ్చిన కొత్త వక్ఫ్ చట్టంతో ఎవరికీ నష్టం లేదన్నారు. ఒక్క రూపాయి దుర్వినియోగం అయ్యే అవకాశం లేకుండా.. గజం భూమి అన్యాక్రాంతం కాకుండా కొత్త చట్టం తెచ్చామన్నారు. 

(telugu-news | telugu breaking news | kishan-reddy | revanth-reddy)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు