/rtv/media/media_files/2025/03/09/X9zjjwoqEA4WXmGMF3fP.jpg)
BRS MLC candidate Photograph: (BRS MLC candidate)
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యవతి రాథోడ్‌ను ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. ఎస్టీ సమాజిక వర్గానికి చెందిన ఆమెకు మరో సారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించుకుంది. అసెంబ్లీలో సంఖ్య బలం ఒక ఎమ్మెల్సీ అభ్యర్థికే ఉన్నా బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్ధులతో నామినేషన్ వేయిస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ఇంకా ఖాయం కాలేదు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, దాసోజు శ్రవణ్‌ల పేర్లను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఇక మొత్తం 38 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి వారిని తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవాలని చూస్తోంది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌లో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురైతే పరిస్థితి ఏమిటన్న దానిపై కూడా కారు పార్టీ విశ్లేషిస్తోంది. ఏదిఏమైనా..రెండో స్థానానికి పోటీ చేయాలా లేదా అన్న అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేడు తేల్చే అవకాశం ఉంది.
Also read: CM Revanth Reddy: అది మోదీ మెడపై కత్తిలా మారుతుంది: సీఎం రేవంత్ రెడ్డి
ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సంపాదించాలంటే 21 ఎమ్మెల్యేలు అవసరం. దీనిలెక్కన చూసుకుంటే మరో నలుగురు ఎమ్మెల్యేలు తమకు అవసరమని బీఆర్ఎస్ లెక్కలు కడుతోంది. రెండో అభ్యర్థిని నిలబెడితే...పార్టీ సింబల్ద్వారా గెలిచిన వారందరికీ విప్ జారీ చేయవచ్చునని బీఆర్‌ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎస్ పార్టీనేనని చెప్పుకుంటున్నారు. పార్టీ మారిన వారిపై బీఆర్‌ఎస్ సుప్రీం కోర్టుకు వెళ్లగా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అయితే తమ పదవులు పోతాయన్న భయంతో బీఆర్‌ఎస్ అసంతృప్తులు తాము ఇంకా బీఆర్‌ఎస్ నే నని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో వారి వైఖరిని బయటపెట్టేందుకు..వారిపై మరింత ఒత్తిడి పెంచడానికి బీఆర్ఎస్ పెద్దలు ఎత్తుగడలు వేస్తున్నారు.
Also read: నడిరోడ్డుపై జర్నలిస్ట్‌ను కాల్చి చంపిన దుండగులు