డ్రగ్స్ కేసులో రేవంత్ నన్ను ఇరికించాలని చూశారు.. BRS ఎమ్మెల్యే

TG: డ్రగ్స్ కేసులో తనను ఇరికించాలని సీఎం రేవంత్ చూశారని సంచలన ఆరోపణలు చేశారు MLA కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో రేవంత్ డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని సవాల్ చేశారు. కావాలనే రాజ్ పాకాలను డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూస్తున్నారన్నారు.

New Update
KOUSHIK REDDY

Padi Koushik Reddy : బీఆర్ఎస్ నేతలందరూ డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ వేసిన సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని అన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని తాను చెప్పినట్లు చెప్పారు. కానీ.. అనిల్ కుమార్ యాదవ్ ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ కు వెళ్లారని అన్నారు. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు టెస్ట్ కు రావాలని చెప్పినట్లు గుర్తు చేశారు.

Also Read :  'కంగువా' మూవీ టీమ్ కు బిగ్ షాక్.. అతని ఆకస్మిక మరణంతో?

డ్రగ్స్ కేసులో నన్ను...

తమకు చెప్పకుండా వెళ్లి రమ్మంటే ఎట్లా? అని ప్రశ్నించారు. అనిల్ కుమార్ యాదవ్ తనకు మంచి మిత్రుడని అన్నారు. తాను అనిల్ కుమార్ యాదవ్ ను తిట్టవచ్చు వార్డు మెంబర్ గా గెలవడని.. కానీ, నా పంచాయితీ అనిల్ కుమార్ యాదవ్ తో కాదు.. రేవంత్ రెడ్డితో తనకు పంచాయితీ అని అన్నారు. డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. మేము కౌశిక్ రెడ్డిని ట్రాప్ చేయలేదని ఇంటిలిజెన్స్ చీఫ్ ను ప్రెస్ మీట్ పెట్టి చెప్పామను అని నిలదీశారు. 

Also Read :  యష్మి చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన నిఖిల్.. బతిమాలినా వద్దంటూ

రేవంత్ కు నా సవాల్..

రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా అని అన్నారు. రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలతో డ్రగ్స్ టెస్ట్ కు రావాలని అన్నారు. మేము డబ్బా  పట్టుకుని రెడీగా ఉన్నామన్నారు. తమ ఎమ్మెల్యేలు అందరు వెయిట్ చేస్తున్నారు ఇప్పటి వరకు మమ్మల్ని పిలవలేదని చెప్పారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డ్రగ్స్ గురించి మాట్లాడితే చిత్తశుద్ధితో మాట్లాడాలని అన్నారు. నన్ను ట్రాప్ చేసినట్లు.. రాజ్ పాకాల కుటుంబాన్ని ఇరికించాలని చూశారని ఆరోపించారు.

Also Read :  రేవంత్‌కు బిగ్ షాక్..కేసీఆర్‌కు టచ్‌లోకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

Also Read :  మెగాస్టార్ మూవీలో మీనాక్షి చౌదరి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల రేగులతండాలో ఇస్లావత్ దీపిక (19)అను మహిళను భర్త శ్రీను, అత్తమామలు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారు. దీంతో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

New Update
Bhadradri Kothagudem crime news

Bhadradri Kothagudem crime news

TG Crime: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల రేగులతండాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఇస్లావత్ దీపిక (19)కు ఆరు నెలల క్రితం వెంకట్యాతండా స్టేజీకి చెందిన బోడా శ్రీనుతో వివాహం జరిగింది. వివాహానంతరం కొద్దికాలం దాంపత్య జీవితం అనుకూలంగా సాగింది. కానీ వేగంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం దీపిక మూడు నెలల గర్భంతో ఉంది. ఈ సమయంలో ఆమెపై భర్త శ్రీను, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడడం మొదలుపెట్టారు. గత రెండు నెలలుగా దీపికపై నిరంతర వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది.

ప్రాణం తీసిన అదనపు కట్నం..

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24న మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులతో గొడవ జరిగినది. దీపికను భర్త శ్రీను, అత్తమామలు కలిసి దాడి చేశారు. సాయంత్రానికి పరిస్థితి మరింత విషమంగా మారింది. భర్త శ్రీను కూల్‌డ్రింక్‌లో పురుగుమందు, ఎలుకల మందు కలిపి దీపికకు తాగించాడు. దీని తరువాత తాను కూడా అదే విషపు మిశ్రమాన్ని తాగాడు. దీనివల్ల ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వారిని ఖమ్మంలోని ఒక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న దీపిక పరిస్థితి విషమించడంతో ఆమె అక్కడే మృతి చెందింది. శ్రీను పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: పల్నాడులో ప్రైవేట్ బస్సు బోల్తా.. స్పాట్‌లోనే ఐదుగురికి..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీపిక తండ్రి వత్మాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీపిక మృతి కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న వయస్సులోనే గర్భంతో ఉన్న కూతురును కోల్పోయిన వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.   ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఇలాంటి ఘోరమైన చర్యకు ఒడిగట్టడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపికకు న్యాయం చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: వేసవిలో గుండె జబ్బులు ఉన్నవారు ఇవి గుర్తుంచుకోవాలి

( ts-crime | ts-crime-news | crime news | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment