KTR: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు TG: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కేటీఆర్ షాక్ ఇచ్చారు. ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన పరువు నష్టం కల్గించేలా వ్యాఖ్యలు చేశారని.. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా దీనిపై బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. By V.J Reddy 23 Oct 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి MLA KTR : కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తనపై నిరాధారమైన, తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ నెల 19 వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో హై టెన్షన్.. ఆ నిర్మాణం కూల్చివేసిన ఆందోళనకారులు! కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని... కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బండి సంజయ్ చేసిన నిరాధారమైన కామెంట్లను నోటీసులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా తీశారని చెప్పారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులో తెలిపారు. కేవలం తనను అప్రతిష్టపాలు చేయాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఇది కూడా చదవండి: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సంచలన ప్రకటన చేసే ఛాన్స్! నేను, సీఎం రేవంత్ కలిసిపోయామని... తాను డ్రగ్స్ తీసుకుంటానని, ఫోన్ ట్యాపింగ్ చేశానని, కేసుల నుంచి తప్పించుకోవటానికి సీఎం రేవంత్ రెడ్డితో రహస్యంగా కలిసిపోయానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని కేటీఆర్ బండి సంజయ్ ను సవాల్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు విస్తృతంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయబడ్డాయని దీని కారణంగా ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ సహా డ్రగ్స్ ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. వాటిన్నింటిని ఉద్దేశపూర్వకంగా కల్పించిన కట్టుకథలుగా కొట్టిపారేశారు. ఇది కూడా చదవండి: షర్మిల, విజయమ్మకు జగన్ షాక్.. పిటిషన్! ] ఇది కూడా చదవండి: 80 విమానాలకు బాంబు బెదిరింపులు #brs #ktr #bjp #bandi-sanjay మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి