BIG BREAKING: 'బండి సంజయ్ పై క్రిమినల్ కేసు!'

కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

New Update
Bandi Sanjay Vs KCR

Bandi Sanjay Vs KCR

కేంద్ర మంత్రి బండి సంజయ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్ రెడ్డి, కె .కిషోర్ గౌడ్, కురువ విజయ్ కుమార్, అభిలాష్ రంగినేని, వెంకటేష్ తదితరులు ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Palla Rajeshwar Reddy vs Kadiyam Srihari : బీఆర్ఎస్ ను నాశనం చేసిందే అతను....కడియం శ్రీహరి సంచలన కామెంట్స్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ వెంట ఉండి బీఆర్ఎస్ ను భ్రష్టు పట్టించినవ్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నావ్. అహంకారం, బలుపు తగ్గించుకో అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

New Update
Palla Rajeshwar Reddy vs Kadiyam Srihari

Palla Rajeshwar Reddy vs Kadiyam Srihari

Palla Rajeshwar Reddy vs Kadiyam Srihari : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  చిల్పూరు మండలం చిన్న పెండ్యాల మీడియా సమావేశంలో రాజేశ్వర్ రెడ్డిపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్యలు చౌకబారు విమర్శలు మానుకోవాలి. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో. మాటల్లో అహంకారం, బలుపు తగ్గించుకో అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!

కేసీఆర్ వెంట ఉండి బిఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించినవ్. అధికారాన్ని, కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నావ్. అవినీతి అ‍క్రమాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యక్తివి నువ్వు. నా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. మొన్నటి ఎన్నికల్లో ఎలా గెలిచావో అందరికీ తెలుసు. కేసీఆర్ వెంట తిరిగి ఆస్తులు కూడ బెట్టుకున్నావ్. అలాంటి ఆలోచన నాకు లేదు. ఉమ్మడి వరంగల్ కు, స్టేషన్ ఘనపూర్ కు నేను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం’ అని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. పల్లా రాజేశ్వర్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కడియం పేర్కొన్నారు. పల్లా మాటల్లో పూర్తిగా అహంకారం కనిపిస్తోంది తప్ప ఏ మాత్రం నిజం లేదని మండిపడ్డారు. 

Also Read: వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి

 పల్లా మాటలు విని కేసీఆర్ పరిపాలన పక్కదారి పట్టిందని, అందుకే తెలంగాణ ప్రజలు కర్రుకాల్చివాత పెట్టారని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులు కూడబెట్టుకున్న పల్లాకు నా గురించి మాట్లాడే హక్కు లేదని కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ది ఏమిటో చూపించాలని సవాల్ విసిరారు. అధికారం పోయినా ఇంకా అహంకారపు మాటలు తగ్గలేదని పేర్కొన్నారు.

 Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
 
 కాగా ఇటీవల మాజీ మంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సిగ్గు, శరం ఉంటే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూతురి సీటు కోసం బీఆర్ఎస్‌లోని దళిత నేతలను, ఉద్యమకారులను కడియం శ్రీహరి బయటకు పంపారని మండిపడ్డారు. ఆరూరి రమేష్, ఎంపీ పసునూరి దయాకర్ కడియం వల్లే పార్టీ్కి రాజీనామా చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. నీ దోపిడీ అంతా రాష్ట్ర ప్రజలకు తెలుసని.. నీలాంటి ద్రోహిని ప్రజలు క్షమించరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా నాన్న ఒక బ్రాండ్ అని కడియం శ్రీహరి కూతురు కావ్య అంటుంది.. నమ్మినవారికి వెన్నుపోటు పోడవడంలోనా కావ్య మీ నాన్న బ్రాండ్ అని ఎద్దేవా చేశారు.

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment