Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు....కాల్ చేసింది ఎవరంటే....

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు ఫోన్ చేసి విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు.

New Update
 Shamshabad Airport

 Shamshabad Airport

Shamshabad Airport: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు ఫోన్ చేసి విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. కాల్ చేసిన వ్యక్తి కామారెడ్డి జిల్లాకు చెందినవాడని ఆర్జీఐఏ సబ్ ఇన్‌స్పెక్టర్ డి అప్పారావు తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి పోలీస్ స్టేషన్‌కు కాల్ చేశాడు. కాల్ డేటా రికార్డ్ (సిడిఆర్) వివరాల సహాయంతో, పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి, ప్రశ్నించగా అతను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని కనుగొన్నారు. బెదిరింపు కాల్ అందుకున్న వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్‌ ను దింపారు. ఎయిర్ పోర్ట్ ఆవరణను క్షుణ్ణంగా వెతికారు.  ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రతి వాహనాన్ని, అరైవల్, డిపార్చర్ ఏరియాలను జల్లెడ పట్టారు. బాంబు స్క్వాడ్ ను రప్పించి క్షుణ్ణంగా గాలించారు. గంటల తరబడి క్షుణ్ణంగా తనిఖీ చేశాక ఎయిర్ పోర్ట్ లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఇది బూటకపు కాల్ అని ధృవీకరించారు.

Also Read: Parliament Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు..ఈరోజు అఖిలపక్షం సమావేశం

Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

కాల్ చేసింది ఎవరంటే....

పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు.. ఫోన్ చేసిన దుండగుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాఫ్తులో కామారెడ్డి జిల్లాకు చెందిన నితిన్ అనే యువకుడు ఈ బెదిరింపు ఫోన్ కాల్ చేశాడని గుర్తించారు. నితిన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అతడికి మతిస్థిమితం లేదని తేలింది. దీంతో నితిన్ కుటుంబ సభ్యులను పిలిపించి అతడిని అప్పగించారు.

Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!

Also Read:  జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoists Surrenders : మావోయిస్టులకు షాక్‌...13 మంది లొంగుబాటు

వరుస ఎన్‌కౌంటర్లతో పలువురు మావోలు మృత్యువాత పడుతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.  తాజాగా వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

New Update
Maoists Surrenders

Maoists Surrenders

Maoists Surrenders : సమసమాజ నిర్మాణమే ధ్యేయమనే లక్ష్యంతో ఆయుధాలు పట్టి అడవుల్లో పోరాడుతున్న మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు వరుస ఎన్‌కౌంటర్లతో పలువురు మావోలు మృత్యువాత పడుతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.  తాజాగా వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మావోయిస్టులకు రివార్డులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ బీజాపూర్ ప్రాంతం గుత్తికోయ కమ్యూనిటికి చెందిన వారని తెలిపారు. తెలంగాణ పోలీసులు కల్పించిన అవహాగాహనతో వీరంతా తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 250 మంది మావోయిస్టులు లొంగిపోతే వారిలో 90 శాతం మంది ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని చెప్పారు. వారందరూ ఇక మీదట మావోయిస్టులకు సహకరించమని తేల్చి చెప్పారన్నారు. వారికి అందజేసిన రివార్డులతో స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఇక ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ లో తెలంగాణ పోలీసుల ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ కూంబింగ్ ఛత్తీస్ గఢ్, కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ అన్నారు. ఈ విషయంలో మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదన్నారు. తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్ ప్రమేయం లేదన్నారు. కర్రెగుట్ట ఘటనలో మావోయిస్టులు ఎవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అనే విషయంలో స్పష్టత లేదని తేల్చి చెప్పారు.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

Advertisment
Advertisment
Advertisment